కార్డియోవాస్కులర్ రిస్క్ తగ్గిస్తున్న ఫ్లెక్సిబుల్ వర్క్.. వెల్లడించిన లేటెస్ట్ స్టడీ

రొటీన్ ఆఫీస్ హవర్స్‌తో పోలిస్తే సౌకర్యవంతమైన పని గంటలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పదేళ్ల వరకు తగ్గించగలవని తాజా అధ్యయనం వెల్లడించింది. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు వర్క్ హవర్స్ కంటే నిరంతరం మారే టైమింగ్స్ గుండెకు మేలు చేస్తాయని హార్వర్డ్ T.Hకి బృందం తెలిపింది.

New Update
కార్డియోవాస్కులర్ రిస్క్ తగ్గిస్తున్న ఫ్లెక్సిబుల్ వర్క్.. వెల్లడించిన లేటెస్ట్ స్టడీ

రొటీన్ ఆఫీస్ హవర్స్‌తో పోలిస్తే సౌకర్యవంతమైన పని గంటలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పదేళ్ల వరకు తగ్గించగలవని తాజా అధ్యయనం వెల్లడించింది. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు గల వర్క్ హవర్స్ కంటే వారానికొకసారి మారే టైమింగ్స్ గుండెకు మేలు చేస్తాయని హార్వర్డ్ T.Hకి చెందిన బృందం నిర్వహించిన ప్రయోగం ఆధారంగా తెలిపింది. ముఖ్యంగా 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు వారి వర్క్ షెడ్యూల్‌లలో మార్పుతో చాలా బెన్ ఫిట్స్ పొందినట్లు ఈ అధ్యయనంలో పేర్కొన్నారు.

Also read :మందుబాబులకు మత్తెక్కించే వార్త…ఆల్కాహాల్ కూడా మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుందట..!!

అయితే మొదటిసారి ప్రొఫెషనల్ లైఫ్, గుండె జబ్బు మధ్య సంబంధంపై పరిశోధనలు జరిపిన స్టడీ ఇదే. కాగా స్ట్రెస్‌ఫుల్ వర్క్‌ప్లేస్ కండిషన్స్, వర్క్-ఫ్యామిలీ సంఘర్షణలు తగ్గించబడినప్పుడు.. ఉత్పాదకత పెరిగింది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గింది. ముఖ్యంగా తక్కువ, మధ్యస్థంగా వేతనాలు చెల్లించబడుతున్న ఎంప్లాయిస్.. వర్క్ షెడ్యూల్స్, జాబ్ డిమాండ్స్‌ విషయంలో తక్కువ కంట్రోల్ కలిగి ఉంటారు. ఎక్కువ అనారోగ్య పరిస్థితులకు లోబడి ఉంటారు. ఈ పని వేళల్లో మార్పులు వారిలో కార్డియోవాస్క్యులర్ రిస్క్ తగ్గించాయని వివరించారు పరిశోధకులు. ఈ అధ్యయనం ప్రారంభంలో సిస్టోలిక్ రక్తపోటు, BMI, గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్, ధూమపాన స్థితి, కొలెస్ట్రాల్ స్థాయిల, కార్డియోమెటబోలిక్ రిస్క్ స్కోర్ (CRS)ని లెక్కించారు పరిశోధకులు. ఇక్కడ అధిక స్కోర్ ఎక్కువ వ్యాధి ప్రమాదాన్ని సూచిస్తుంది. అలాగే 12 నెలల తర్వాత కూడా వీటిని నమోదు చేయగా ఆఫీసు టైమింగ్స్‌లో చేంజ్ చూసిన వారు ఆరోగ్యపరంగా 5.5 నుంచి 10.3 సంవత్సరాల వయస్సుకు సమానమైన CRSలో తగ్గుదలని అనుభవించారు. ముందుగా అధిక CRS ఉన్న 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న సిబ్బంది కూడా మెరుగుదలను చూశారని ఆధారాలతో నిరూపించారు. ప్రస్తుతం ఈ జనరేషన్ బిజీ షెడ్యూల్ కు ఇదొక ఊరటనిచ్చే విషయమని, ఈ దిశగా వర్క్ కండిషన్స్ లో మార్చులు చేసుకోవడం ఉత్తమ మార్గంగా సూచించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

LSG vs GT: గుజరాత్‌కు బిగ్ షాక్.. ఒక్కసారిగా పడిపోయిన వికెట్లు- 15 ఓవర్లకు ఎంత స్కోరంటే?

లక్నో vs గుజరాత్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో గిల్, సుదర్శన్ చెరో హాఫ్ సెంచరీ చేశారు. కానీ వరుస వికెట్లు కోల్పోవడంతో స్కోర్ తగ్గిపోయింది. 15ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజ్‌లో రూథర్‌ఫోర్డ్, బట్లర్ ఉన్నారు.

New Update
LSG vs GT

LSG vs GT

ఐపీఎల్ 2025 మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇరు జట్లు టైటిల్ కోసం పోటా పోటీగా మ్యాచ్‌లు ఆడుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ మరో మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే టాస్‌ నెగ్గిన లక్నో జట్టు.. మొదట బౌలింగ్ ఎంచుకుంది.

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

10 ఓవర్లలో 0 వికెట్లు

దీంతో సాయి సుదర్శన్‌, శుభ్‌మన్‌ గిల్‌ క్రీజులోకి వచ్చారు. మొదటి నుంచి ఓ వైపు దూకుడుగా.. మరోవైపు వికెట్లు నష్టపోకుండా పరుగులు రాబట్టారు. కొట్టాల్సిన దగ్గర పెద్ద పెద్ద షాట్లు కొట్టారు. ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీ చేశారు. ఇలా 10 ఓవర్లలో గుజరాత్ జట్టు ఒక్క వికెట్ పడకుండా 101 పరుగులు చేసింది. దీంతో 100 పరుగులు ఇచ్చినా.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లు తలలుపట్టుకున్నారు. 

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

రెండు హాఫ్ సెంచరీలు

అదే సమయంలో ఓపెనర్ గిల్‌(60)ను ఔట్ చేశారు. ఎట్టకేలకు ఓపెనర్ల భాగస్వామ్యానికి (73 బంతుల్లో 120 పరుగులు) లక్నో జట్టు తెరదించింది. ఇక ఆ తర్వాతే సాయి సుదర్శన్ కూడా పెవిలియన్‌కు చేరాడు. భారీ షాట్ ఆడే క్రమంలో సాయి సుదర్శన్‌ (56) క్యాచ్ ఇచ్చి ఔట్‌ అయ్యాడు. రవి బిష్ణోయ్‌ వేసిన 13.1 ఓవర్లో నికోలస్‌ పూరన్‌కు క్యాచ్‌ ఇచ్చి సుదర్శన్‌ వెనుదిరిగాడు. 

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ (2) సైతం వెను వెంటనే చేతులెత్తేశాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతడు.. ఈ మ్యాచ్‌లో తడబడ్డాడు. దీంతో గుజరాత్ జట్టు 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో రూథర్ ఫోర్డ్ (1*), బట్లర్ (9*) పరుగులతో ఉన్నారు. 

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

( LSG vs GT | latest-telugu-news | IPL 2025)

Advertisment
Advertisment
Advertisment