Indian Origin family: దీపావళి వేడుకల్లో ప్రమాదం..లండన్‌ లో భారత సంతతి కుటుంబం మృతి!

లండన్‌ లో భారత సంతతికి చెందిన ఓ కుటుంబం అగ్నికి ఆహుతి అయ్యింది. దీపావళి పండుగ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు.

New Update
Indian Origin family: దీపావళి వేడుకల్లో ప్రమాదం..లండన్‌ లో భారత సంతతి కుటుంబం మృతి!

దీపావళి (Diwali) వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. లండన్‌ (london) లో భారత సంతతి (Indian origin family) కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు అగ్నికి ఆహుతి అయ్యారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది.

ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అధికారులు మృతుల వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ విషయం గురించి మెట్రో పాలిటన్‌ చీఫ్‌ పోలీస్ సీన్‌ విల్సన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు గల కారణాలను గురించి తెలుసుకుంటున్నట్లు ఆయన వివరించారు.

ముందు జాగ్రత్తగా చుట్టు పక్కల ప్రాంతాలను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి హౌన్‌స్లో ప్రాంతంలోని ఛానెల్‌ క్లోజ్‌ నుంచి సమాచారం వచ్చినట్లు వారు వివరించారు. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌ లు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే ఐదుగురు మరణించగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి మెరుగు పడినట్లు వైద్యులు వివరించారు. మృతి చెందిన వారు అంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారిగా అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన గురించి భారత సంతతికి చెందిన దిలీప్‌ అనే వ్యక్తి మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అదే భవనంలో ఉన్న తన బావ ఉన్నారని చెప్పారు.

తనకు సమాచారం అందిన వెంటనే ఇక్కడకు వచ్చినట్లు ఆయన వివరించారు. అసలేం జరిగిందో తనకు తెలియదన్నారు. బాధిత కుటుంబం ఇటీవలే బెల్జియం నుంచి లండన్ లోని ఇంటికి మారినట్లు ఆయన తెలిపారు.

Also read: తిరుమలలో మళ్లీ చిరుత కలకలం.. అధికారులు ఏం చెబుతున్నారంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

కువైట్‌లో ఏపీ మహిళపై యాసిడ్ దాడి.. పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లి!

వైస్సార్‌కు చెందిన ఓ మహిళ పొట్టకూడు కోసం ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లింది. ఇంట్లో పని చేస్తే నెలకు 150 దినార్లు జీతానికి ఒప్పందం చేసుకోగా.. ఆ తర్వాత 100 దినార్లు మాత్రమే ఇచ్చారు. దీంతో ఆ మహిళ యాజమానులను అడగడంతో యాసిడ్‌తో దాడి చేసి, పిచ్చాసుపత్రిలో చేర్చారు.

New Update
kuwait

kuwait Photograph: (kuwait)

జీవనం కోసం కువైట్ వెళ్లిన మహిళపై అక్కడ యజమానులు యాసిడ్ దాడి చేశారు. జీతం అడిగినందుకు.. ఆ మహిళపై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం పొన్నాడకు చెందిన కాకాడ లక్ష్మి భర్త మృతి చెందారు. దీంతో ఉపాధి కోసం ఆ మహిళ రెండు నెలల క్రితం వైఎస్సార్‌ జిల్లాకు చెందిన ఓ ఏజెంట్‌ ద్వారా కువైట్‌‌కి వెళ్లింది.

ఇది కూడా చూడండి: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

నెల వేతనం ఎందుకు తక్కువ ఇచ్చారని..

అక్కడ ఓ ఇంట్లో పనిచేస్తే.. నెలకు 150 దీనార్లు వేతనం ఇవ్వడానికి ఒప్పందం పెట్టుకున్నారు. అయితే ఉద్యోగంలో చేరిన తర్వాత యజమానులు కేవలం 100 దీనార్లు వేతనం మాత్రమే ఇవ్వడంతో లక్ష్మి వారిని ప్రశ్నించింది. దీంతో యాజమానులు ఆగ్రహంతో ఆమెపై యాసిడ్‌ పోసి, పిచ్చాసుపత్రిలో చేర్పించారు. అయితే ఈ ఘటన జరిగి పది రోజులు అవుతుంది.

ఇది కూడా చూడండి: USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

బాధితురాలు ఆసుపత్రి యాజమాన్యానికి జరిగిన విషయం చెప్పడంతో తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెతో ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదు చేయించారు. అయితే కేసు వెనక్కి తీసుకుంటేనే ఫాస్‌పోర్టు ఇస్తామని అంటున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏం చేయాలో తెలియడం లేదని, ప్రభుత్వం స్పందించి లక్ష్మిని సొంత గ్రామానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు కోరారు.

ఇది కూడా చూడండి:  Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

 

Advertisment
Advertisment
Advertisment