Salaar Song: ఇదికదా.. ఫ్యాన్స్ కి కావలసింది.. ఒక్క సాంగ్ తో సలార్ ఎమోషనల్ దుమ్మురేపాడు

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం సలార్. డిసెంబర్ 22 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సలార్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. 'సూరీడు గొడుగు పట్టి.. వచ్చాడే భుజము తట్టి' అంటూ సాగే ఈ స్నేహగీతానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.

New Update
Salaar Song: ఇదికదా.. ఫ్యాన్స్ కి కావలసింది.. ఒక్క సాంగ్ తో సలార్ ఎమోషనల్ దుమ్మురేపాడు

Salaar Song: రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేశారు సలార్ మేకర్స్. ప్రమోషన్స్ విషయంలో అసంతృప్తిగా ఉన్న వారిని ఒక్క పాటతో సంతోషంలో ముంచేశారు. పక్కా కమర్షియల్ మూవీగా ప్రచారంలో ఉన్న సలార్ సినిమా నుంచి ఇలాంటి సాంగ్ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును.. ఫ్రెండ్షిప్ నేపధ్యంగా (Friendship Theme) కూల్ సాంగ్.. దానికి తోడుగా మెస్మరైజింగ్ ఇమేజెస్ తో సలార్ సినిమా మరింత హైప్ కి వెళ్ళిపోయింది.

విజనరీ డైరెక్టర్ ప్రశాంత్ (Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సలార్. ఈ సినిమాను మేకర్స్ రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. సలార్ పార్ట్ 1- సీజ్ ద ఫైర్ డిసెంబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానున్నట్లు ప్రకటించారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. స్నేహ కథనంతో రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ దేవ గా, ప్రభాస్ స్నేహితుడిగా పృథ్వీ రాజ్ నటించారు. ఇద్దరి స్నేహితుల చుట్టూ తిరిగే కథే సలార్. ఇటీవలే విడుదలైన సలార్ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Also Read: Salaar Trailar: “దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో విడదీయలేని స్నేహం”.. సలార్ ట్రైలర్ అదిరిపోయింది..!

సలార్ రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ సందర్భంగా తాజాగా సలార్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. సూరీడు గొడుగు పట్టి.. వచ్చాడే భుజము తట్టి అంటూ సాగిన ఈ స్నేహగీతం మనసుల్ని హత్తుకునేలా ఉంది. ఈ పాటలోని లిరిక్స్ సినిమాలో దేవా (ప్రభాస్ ), వరద రాజ్ మున్నార్( పృథ్వీరాజ్) మధ్య ఉండే గొప్ప స్నేహాన్ని తెలియజేసేలా ఉంది. పాటలో ప్రభాస్, పృథ్వీరాజ్, ఈశ్వరి రావ్ విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సాంగ్ విడుదలైన 16 గంటల్లోనే 4 మిలియన్ వ్యూస్ తో సోషల్ మీడియాల్ టాప్ 1 ట్రెండింగ్ గా సాగుతోంది. సలార్ నుంచి విడుదలైన ఈ స్నేహ గీతానికి రవి బస్రూర్ సంగీతం అందించగా కృష్ణ కాంత్ అద్భుతమైన లిరిక్స్ రాశారు. హరిణి ఇవటూరి ఈ పాటను ఆలపించారు.

publive-image

Also Read: Saindhav Movie: సైంధవ్ మూవీ ప్రమోషన్స్.. సరదాగా కాలేజీలో క్రికెట్ ఆడిన వెంకటేష్

Advertisment
Advertisment
తాజా కథనాలు