America: అమెరికాలో మరోసారి కాల్పులు..ఇద్దరు మృతి.. 22 మందికి గాయాలు!

అమెరికాలోని కాన్సాస్ సిటీ లో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాన్సాస్‌లో జరిగిన కాల్పుల్లో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అధికారులు ప్రకటించారు.

New Update
America: అమెరికాలో మరోసారి కాల్పులు..ఇద్దరు మృతి.. 22 మందికి గాయాలు!

America: అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల మోత మోగుతుంది. వరుస కాల్పుల ఘటనలతో అమెరికా (America) ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. తాజాగా ఈ ఘటన అమెరికాలోని కాన్సాస్ సిటీ(Kansas City) లో చోటుచేసుకుంది. కాన్సాస్‌లో జరిగిన కాల్పుల్లో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.

వీరిలో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. ‘సిటీ చీఫ్స్ సూపర్ బౌల్’ అనే క్రీడా ఈవెంట్ సందర్భంగా ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు కాన్సాస్ సిటీ పోలీస్ చీఫ్ స్టేసీ గ్రేవ్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు నిందితుడిని పట్టుకోవడంలో సహకరించినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు.

పోలీసులు పెద్దగా సమాచారం ఇవ్వలేదు
ఈరోజు జరిగిన ఘటన గురించి నేను బాధపడ్డాను అని గ్రేవ్స్ అన్నారు. అరెస్టయిన వ్యక్తుల గురించి పోలీసులు వెంటనే ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు.

కాల్పులకు గల కారణం ఇంకా తెలియరాలేదు
కాల్పులు జరపడానికి గల కారణాలను కూడా పోలీసులు వెల్లడించలేదు. గతేడాది డెన్వర్‌లో జరిగిన ఎంబీఏ ఛాంపియన్‌షిప్‌లో కూడా కాల్పులు జరిగాయి. అందులోనూ చాలా మందికి గాయాలయ్యాయి. ఈ కాల్పుల తర్వాత, పారిపోతున్న వ్యక్తుల చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. కొద్ది రోజుల క్రితం కూడా న్యూయార్క్‌లోని సబ్‌వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై కూడా కాల్పులు జరిగాయి.

Also read:పాలన మూగ ప్రేక్షకుడిగా చూస్తుండిపోయింది.. సందేశ్‌ఖలీ ఘటన పై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఉగ్రదాడిలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా

జమ్మూ కశ్మీర్‌లో పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన ఉగ్రదాడిలో 28 మృతి చెందారు. ఈ కుటుంబాలకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్ర గాయాలు అయిన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలు అయిన వారికి రూ.లక్ష ఇస్తామని తెలిపారు. 

New Update
Jammu Attack

Jammu Attack

జమ్మూ కశ్మీర్‌లో పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున అందజేస్తామని ప్రకటించింది. 

ఇది కూడా చూడండి: J&K TerrorAttack:ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

టూరిస్ట్‌లను టార్గెట్ చేసి..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు