Fire Accident : జియాగూడలో భారీ అగ్నిప్రమాదం.. చిన్నారి మృతి!

హైదరాబాద్‌ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని కుల్సుంపుర జియాగూడ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌ లో ఉన్న ఫర్నిచర్‌ తయారీ గోదాంలో బుధవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది.

New Update
Fire Accident : జియాగూడలో భారీ అగ్నిప్రమాదం.. చిన్నారి మృతి!

Fire Accident In Furniture Godown : హైదరాబాద్‌ (Hyderabad) లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. నగరంలోని కుల్సుంపుర జియాగూడ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌ లో ఉన్న ఫర్నిచర్‌ తయారీ గోదాం (Furniture Godown) లో బుధవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భవనంలోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా.. 8 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. భవన పరిసర ప్రాంతాల్లో భారీగా మంటలు, పొగ అలముకోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది పది ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పారు. ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో 20 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారందరినీ కూడా నిచ్చెన ద్వారా కిందకి తీసుకుని వచ్చారు. వారిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి (Osmania Hospital) తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

శ్రీనివాస్ అనే వ్యక్తి కుటుంబంలో నలుగురికి గాయాలు కాగా శ్రీనివాస్ పెద్ద కూతురు శివప్రియ మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. గాయపడిన వారిలో కూడా పలువురికి సీరియస్‌ గా ఉన్నట్లు సమాచారం. విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖాధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే రాత్రి సమయంలో గోదాంలో పెద్ద సంఖ్యలో మనుషులు ఎందుకు ఉన్నారనే విషయం అనుమానంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Also read: జనసేన పార్టీ ఐదుగురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు



Advertisment
Advertisment
తాజా కథనాలు