Negative Energy: ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో ఈ టెక్నిక్‌తో తెలుసుకోండి ఇంట్లో ఎక్కువగా గొడవలు జరుగుతున్నా, ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, ప్రశాంతత లేకపోతే ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని అంటుంటారు. కొన్ని దుష్టశక్తుల ప్రభావం ఇంట్లోని వారందరిపై పడుతుంది. ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని పారద్రోలే కొన్ని చిట్కాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Vijaya Nimma 14 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Negative Energy: ఇంట్లో ఎక్కువగా గొడవలు జరుగుతున్నా, ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, ప్రశాంతత లేకపోతే ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని అంటుంటారు. పరిష్కారం దొరక్క సతమతం అవుతుంటారు. ఎంత సంపాదించినా డబ్బు ఇంట్లో ఉండదు, దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీనే అని నిపుణులు కూడా అంటున్నారు. కొన్ని దుష్టశక్తుల ప్రభావం ఇంట్లోని వారందరిపై పడుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని పారద్రోలవచ్చని నిపుణులు అంటున్నారు. నెగెటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడానికి పెయింటింగ్, పారదర్శకంగా నీట్‌గా ఉండే గాజు గ్లాసు తీసుకోవాలి. గ్లాసుపై వేలి ముద్రలు పడకుండా చూసుకోవాలి. మళ్లీ మళ్లీ అదే గ్లాసును వాడకూడదు. గ్లాసులో ఒక భాగం రాళ్ల ఉప్పు వేయాలి, తర్వాత అందులో రెండు రెట్లు వెనిగర్ పోయాలి. మిగతా భాగంలో నీటిని పోయాలి. నీటిని పోసే సమయంలో మిగతావి కదలకుండా చూసుకోవాలి. గ్లాసును కదిలించకుండా ఏదైనా శక్తి ఉందని భావించిన మూలకు పెట్టాలి. ఒక 24 గంటల పాటు అక్కడే ఉంచాలి. తర్వాత రోజు నీళ్లను చూడాలి, ఎలాంటి మార్పు లేకపోతే ఇంట్లో దుష్టశక్తులు లేనట్టే. నీరు ఒకవేళ ఆకుపచ్చ రంగు లేదా గ్రే కలర్‌లోకి మారినా, మచ్చలు కనిపించినా నెగెటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని గ్రహించాలి. తర్వాత గ్లాసు తీసేసి నీటిని పారపోసి శుభ్రం చేయాలి. ఇలా క్రమంగా చేస్తుంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీలు పోతాయని నిపుణులు అంటున్నారు. చీకట్లో కొవ్వొత్తిని వెలిగించి తల పైకి ఎత్తి చూసినా నెగటివ్ ఎనర్జీ ఎక్కడుందో కొందరికి అర్థం అవుతుందని చెబుతున్నారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, దూపం వేయడం వంటివి చేస్తే కూడా ఫలితం ఉంటుందని అంటున్నారు. ఇది కూడా చదవండి: రాతి ఉప్పుతో లెక్కపెట్టలేనన్ని ప్రయోజనాలు.. తిని చూడండి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #home #negative-energy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి