AP BJP: పొత్తులపై తుది నిర్ణయం జాతీయ నాయకత్వానిదే.! పొత్తుల అంశాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని ఏపీ బీజేపీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పనిచేయాలని పవన్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఏపీ బీజేపీ.. పవన్ వ్యాఖ్యలను జాతీయ నాయకత్వం చూసుకుంటుందని తెలిపింది. By Karthik 14 Sep 2023 in గుంటూరు రాజకీయాలు New Update షేర్ చేయండి AP BJP: పొత్తుల అంశాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ పార్టీలు కలిసి పనిచేయాలని పవన్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఆమే.. పవన్ వ్యాఖ్యలను జాతీయ నాయకత్వం చూసుకుంటుందని వెల్లడించారు. ప్రస్తుతం ఏపీలో భారతీయ జనతా పార్టీ జనసేనతో మాత్రమే కలిసి పని చేస్తునట్లు వివరించారు. రాష్ట్రంలో పొత్తులపై మాత్రం తుది నిర్ణయం ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీసుకుంటారని స్పష్టం చేశారు. కాగా చంద్రబాబుతో ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం కలిసి పోటీచేస్తాయని అధికారికంగా ప్రకటించారు. రేపటి నుంచి టీడీపీ-జనసేన నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా అరాచక పాలన సాగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను చంద్రబాబును పరామర్శించడానికి రాజమండ్రికి వచ్చినట్లు జనసేనాని స్పష్టం చేశారు. Also Read: స్కీల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై సంచలన వివరాలు వెల్లడించిన సీఐడీ చీఫ్.. మరోవైపు నరేంద్ర మోడీ లాంటి నాయకుడు దేశానికి అవసరం కాబట్టే తాను 2014లో మోడీకి మద్దతు తెలిపినట్లు పవన్ గుర్తు చేశారు. చంద్రబాబుకు తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవన్న పవన్.. పాలసీ విభేదాల వల్లే తాను అప్పుడు బయటకు వచ్చినట్లు వెల్లడించారు. చంద్రబాబు అనుభవాన్ని తాను ఏ రోజూ ప్రశ్నించలేదన్నారు. ఆయన నాయకత్వంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. అలాంటి విజన్ ఉన్న నాయకుడు దేశానికి చాలా అవసరమన్నారు. లక్ష కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న సైబరాబాద్‌ను సిటీగా నిర్మించింది చంద్రబాబే అన్నారు. క్రిమినల్ కేసులు ఉన్న జగన్ చంద్రబాబుపై కేసులు మోపడం విడ్డూరంగా ఉందన్నారు. Also Read: వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం కలిసి పోటీచేస్తాయి: పవన్ #tdp #chandrababu #bjp #janasena #modi #pawan #amit-shah #jana-sena-alliances మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి