Dil Raju: ఏంటి పీకేది అంటూ రిపోర్టర్స్ పై దిల్ రాజు ఫైర్ ..

సంక్రాంతి థియేటర్స్ విషయంలో దిల్ రాజుని టార్గెట్ చేస్తూ తప్పుడు వార్తలు రాస్తున్న వారిపై నిప్పులు చెరిగారు దిల్ రాజు.. రిపోర్టర్స్ VS దిల్ రాజుగా మారిన తాజా వీడియో వైరల్ గా మారింది.

New Update
Dil Raju: ఏంటి పీకేది అంటూ రిపోర్టర్స్ పై  దిల్ రాజు  ఫైర్ ..

DIL RAJU VS REPORTERS : సంక్రాంతి సినిమా థియేటర్స్ విషయంలో చిలికి చిలికి గాలివానలా మారుతోంది. చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకకపోవడం లో దిల్ రాజు ప్రమేయం ఉందని..ప్రతీ సంక్రాంతికి దిల్ రాజునే టార్గెట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో రెండు వెబ్ సైట్స్ దిల్ రాజుపై విమర్శలు గుప్పిస్తూ ఆర్టికల్స్ రాశాయి. దీంతో ఆగ్రహానికి గురయుస దిల్ రాజు వాస్తవాలు తెలియకుండా వార్తలు రాస్తే తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు.

ALSO READ:నన్ను టార్గెట్ చేస్తే తాట తీస్తా- దిల్ రాజు స్ట్రాంగ్ వార్నింగ్

పిచ్చి పిచ్చిగా రాస్తే

అయితే .ఈ విషయం రోజు రోజుకీ పెద్దగా మారుతోందని తాజాగా వైరల్ అవుతోన్న ఒక వీడియో చూస్తుంటే అర్థం అవుతోంది. ఈవీడియోలో దిల్ రాజుకి ఆయా రిపోర్టర్స్ కు గొడవ జరుగుతోంది. పిచ్చి పిచ్చిగా రాస్తే ఊరుకునేది లేదు ..గుర్తుపెట్టుకోండి అంటూ ఓ రిపోర్టర్ కి వార్నింగ్ ఇస్తుండగా.. వేరే రిపోర్టర్ అడ్డుకుంటూ ఉంటే..దిల్ రాజు కోపంగా ఏంటి పీకేది అంటూ ఫైర్ అయ్యారు. దీన్ని బట్టి చూస్తే వ్యవహరం సినిమాటోగ్రఫీ శాఖ వరకు వెళ్ళబోతోందని అర్థమవుతోంది.

దిల్ రాజు సహనానికి పరీక్ష
నిజానికి దిల్ రాజు నిర్మించిన ఏ సినిమా కూడా ఈ సంక్రాంతికి రిలీజ్ అవడం లేదు.కేవలం పంపిణీదారుడిగా మాత్రమే ఆయన గుంటూరు కారం సినిమా రిలీజ్ చేస్తున్నారు. స్టార్ హీరో సినిమా భారీ బడ్జెట్ మూవీ కాబట్టి బ్రేక్ ఈవెన్ చేరుకోవాలన్నా ఎక్కువ థియేటర్స్ లో బొమ్మ పడాలి. ఆ టెన్షన్ తో దిల్ రాజు సతమతమవుతుంటే మధ్యలో ఈ తప్పుడు వార్తలతో పరిస్థితిని నెగిటివ్ గా మారుస్తున్నారు. ఈ క్రమంలో దిల్ రాజు సహనానికి పరీక్ష పెడుతున్నారు. చూడాలి మరి..ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందో.

షిఫ్ట్ చేయమంటే కుదరదన్నారు 

ఇక .. ఈ సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండగా .. రవితేజ ఈగల్ మూవీ  రేసునుంచి తప్పుకుంది. ఇక.. మిగిలినవి 4 సినిమాలలో  ముందుగా జనవరి 12న రిలీజ్ అయ్యే సినిమాలు గుంటూరు కారం , హనుమాన్ ,13న సింధవ్, 14న నా సామిరంగా చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.వెతన్నికంటే స్టార్ కాస్టింగ్ విషయంలో చిన్న సినిమా హనుమాన్. ఈ మూవీ విషయంలో రాజుకున్న వివాదాలు ఇప్పుడు రాజుకుంటున్నాయి. నిజానికి దిల్ రాజు ఈ హనుమాన్ మోవిఎని 14 వ తేదీకి షిఫ్ట్ చేయమని నిర్మాతలను అడగటం జరిగింది. నార్త్ లో హనుమాన్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ,అక్కడ డేట్ మార్చడం కుదరని పని . అందుకోసమే హనుమాన్ మేకర్స్ అంగీకరిచలేదు

కంటెంట్ లో దమ్ము

టాలివుడ్ లో అటు క్రియేటివిటీ పరంగా కాని, వ్యాపార పరంగాకాని చాలా అనుభవం ఉన్న తెలివైన నిర్మాత దిల్ రాజు . ఇదే విషయాన్నీ హనుమాన్ ప్రి రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి చెప్పడం జరిగింది. సినిమాకు ఈ రోజు థియేటర్స్ దొరకలేదు అంటే సినిమా బాగుంటే రేపు దొరుకుతాయి. కంటెంట్ భలంగా ఉండాలి. అని చిరంజీవి ఖైదీ నంబర్ 150 మూవీ రిలీజయిన టైమ్లో శతమానం భవతి రిలీజ్ అవటాన్ని గుర్తుచేశారు. ఇదే విషయాన్నీ దిల్ రాజుతో చిరంజేవి ప్రస్తావించగా ..శతమానం భవతి ఆడుతుందని దిల్ రాజు  చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారని చిరు అన్నారు. ఏదేమయినా చిరు మాటలను సైతం వక్రీకరించి రాసిన ఆ రెండు వెబ్ సైట్స్ పై సెగ రాజుకుంటోంది

ALSO READ:రోజుకు 6 ఆటలు .. టికెట్స్ ధరలు పెంపుకై గ్రీన్ సిగ్నల్

Advertisment
Advertisment
తాజా కథనాలు