Elections : నేడు దేశంలో ఐదో దశ పోలింగ్.. ఈ సారి కూడా పోటీలో ప్రముఖులు! దేశ వ్యాప్తంగా నేడు లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ జరగనుంది. నేడు ఎనిమిది రాష్ట్రాల్లోని 49 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఐదో దశలో పోటీ లో నిలిచిన వారిలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వంటి ప్రముఖులు ఉన్నారు. By Bhavana 20 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Fifth Phase Elections 2024 : దేశ వ్యాప్తంగా నేడు లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) ఐదో దశ పోలింగ్ (Polling) జరగనుంది. అందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. నేడు ఎనిమిది రాష్ట్రాల్లోని 49 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. యూపీలోని 14, మహారాష్ట్రలోని 13 స్థానాల్లో అత్యధికంగా ఓటింగ్ జరుగుతోంది. ఒడిశాలో 5, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో ఒకటి, లడఖ్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది. అయితే .. ఐదో దశలో పలువురు ప్రముఖ రాజకీయ నేతల భవిష్యత్ ఓటర్ల (Voters) చేతిలో ఉంది. ఐదో దశలో పోటీ లో నిలిచిన వారిలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, చిరాగ్ పాశ్వాన్, రాజీవ్ ప్రతాప్ రూడీ, రోహిణి ఆచార్య, ఒమర్ అబ్దుల్లా, పీయూష్ గోయల్ వంటి ప్రముఖులంతా తలపడుతున్నారు. ఇప్పటివరకు 4 దశలలో పోలింగ్ జరగగా 379 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఐదో దశతో మొత్తం 428 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి. ఇప్పుడు.. ఐదో దశ లోక్‌సభ ఎన్నికల్లో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుండగా... ఈ నెల 25న ఆరో దశ, జూన్ 1న ఏడో విడత పోలింగ్తో దేశంలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంది. Also read: రోజూ ఇలా నడిస్తే నెలలోపే మీ బరువు ఇట్టే తగ్గుతారు! #lok-sabha-elections-2024 #voters #ec #fifth-phase-polling మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి