Fever Syndrome: మీ పిల్లలకు పదే పదే జ్వరం వస్తుందా? ఇదే కారణం కావొచ్చు..!

మీ పిల్లలకు తరచూ జ్వరం వస్తోందా? జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా? పదే పదే పిల్లలకు జ్వరం రావడానికి వైరస్‌లు, బ్యాక్టీరియా కారణం అవ్వొచ్చని చెబుతున్నారు. అంతేకాదు.. తరచుగా ఫీవర్ వస్తున్నట్లయితే.. దానికి కారణం పీరియాడిక్ ఫీవర్ సిండ్రోమ్ అయి ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. మారిన వాతావరణంలో పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నట్లయితే.. వెంటనే వైద్యులకు చూయించాలి. వారి సూచనల మేరకు చికిత్స అందించాలి.

New Update
Fever Syndrome: మీ పిల్లలకు పదే పదే జ్వరం వస్తుందా? ఇదే కారణం కావొచ్చు..!

Fever Syndrome in Children: సడెన్‌గా మారుతున్న వాతావరణంతో పిల్లలు(Health) జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల(Children) రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. దీని కారణంగా చిన్నపాటి చల్లటి గాలి వీచినా.. వెంటనే పిల్లలు అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే, పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తుంటుంది. అయితే, తరచుగా జ్వరం రావడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీ బిడ్డకు పదే పదే జ్వరం వస్తున్నట్లయితే.. ఏమాత్రం నిర్లక్ష్యం వహించకండి. వెంటనే వైద్యులకు చూపించాలి. ఎందుకంటే.. జ్వరం రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు.

ఈ కారణాల వల్ల పిల్లలకు మళ్లీ మళ్లీ జ్వరం వస్తుంటుంది..

మీ బిడ్డకు తరచుగా జ్వరం వస్తున్నట్లయితే.. అది వైరస్ లేదా బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ కారణమై ఉండొచ్చు. పీరియాడిక్ ఫీవర్ సిండ్రోమ్ కారణంగా పిల్లలకు మళ్లీ మళ్లీ జ్వరం వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఈ సిండ్రోమ్ జన్యు లోపం కారణంగా కూడా రావొచ్చంటున్నారు వైద్యులు. దీని కారణంగా పిల్లల్లో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే, వైరస్ వ్యాక్సినేషన్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా కూడా జ్వరం వస్తుంటుంది.

జ్వరం లక్షణాలను ఇలా గుర్తించండి..

శరీర ఉష్ణోగ్రత పెరగడంతో పాటు.. చలితో పిల్లలు చిరాకు పడుతుంటారు. పిల్లలు ఆహారం తీసుకోరు. ఏమీ తినకుండా ఉంటారు. అలసటగా, బలహీనంగా ఉంటారు. పిల్లలు ప్రతిసారి ఏడుస్తుంటారు. ఇవన్నీ జ్వరం లక్షణాలు కావచ్చు.

చికిత్స ఎలా?

పిల్లలకు పదే పదే జ్వరం వస్తున్నట్లయితే.. ఖచ్చితంగా వైద్యులకు చూపించాలి. జ్వరం వచ్చినప్పుడు వైద్యుల సలహా తీసుకోవాలి. పిల్లలకు తరచుగా జ్వరం వస్తున్నట్లయితే.. వారికి పుష్కలంగా నీరు తాగించాలి. పిల్లలు శ్వాస తీసుకునే విధానాన్ని గమనించాలి. పిల్లలకు 3 రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉంటే.. ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. పిల్లల జ్వరాన్ని తరచుగా తనిఖీ చేయాలి. చిన్న పిల్లల్లో తరచుగా వచ్చే జ్వరం ఒక సాధారణ సమస్య. అయినప్పటికీ.. చాలా జాగ్రత్తగా ఉండాలి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలు ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఇవ్వడం జరిగింది. పిల్లల ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా సమస్యలుంటే.. వైద్యులను సంప్రదించాలి.

Also Read:

అదే జరిగితే రేవంత్ ఎప్పుడో జైలుకెళ్లేవాడు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..

ముఖేష్ అంబానీకి మరో మెయిల్.. ఈసారి రూ. 200 కోట్లు డిమాండ్..

Advertisment
Advertisment
తాజా కథనాలు