Bottle Feeding : బిడ్డకు డబ్బా పాలు పట్టిస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

ప్రస్తుత కాలంలో చాలా మంది తల్లులు బిడ్డలకు డబ్బా పాలు అలవాటు చేస్తున్నారు. అలా డబ్బాపాలు పట్టించేటప్పుడు వాటిని శుభ్రంగా వేడినీటితో కడగాలి, అంతేకాకుండా ఎక్కువ రోజులు ఒకే డబ్బాను వాడకూడదు దీని వల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడతారు.

New Update
Bottle Feeding : బిడ్డకు డబ్బా పాలు పట్టిస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

Feeding Bottle : ఇంట్లో చంటిపాపలు ఉన్నారంటే ఆ ఆనందమే వేరు. వారు పుట్టినప్పటి నుంచి ఇంట్లో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఒక్కసారిగా వాతావరణం మొత్తం మారిపోతుంది. చంటిపాపలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరు చూసుకుంటు ఉంటారు. అలాంటి పసిపాపల విషయంలో కూడా మనం కొన్ని పొరపాట్లు చేస్తుంటాం.

అదే పాలు పట్టే విషయం. ప్రస్తుత కాలంలో చాలా మంది అమ్మలు తమ బిడ్డలకు ఆరు నెలల వరకే పాలు పడుతున్నారు. అది ఆరోగ్య విషయంలో(Health) కానివ్వండి, ఉద్యోగాలు చేసే తల్లులు అయితే తమ బిడ్డలకు పాలను మరిపించడానికి డబ్బా పాల మీద ఆధారపడుతున్నారు. దీని వల్ల పిల్లల్లో చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

శుభ్రత అవసరం..

డబ్బా పాలు(Bottle Feeding) పట్టించేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే పలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల(Child) విషయంలో జాగ్రత్త వహించాలి. ముందు పిల్లలకు డబ్బా పాలు పట్టించే ముందు డబ్బాలను వేడి నీటితో శుభ్రంగా కడగాలి. ఆ తరువాత చేతులు శుభ్రంగా కడుక్కొని పాలు పోసి పిల్లలకు పట్టించాలి.

లేకపోతే డబ్బాలలో ఉండే క్రిములు పిల్లలకు అనారోగ్య సమస్యలు తెచ్చిపెడతాయి. కొంతమంది అయితే ఒక డబ్బాను ఎన్నో సంవత్సరాలుగా వాడుతూనే ఉంటారు. ఇలా చేయడం వల్ల పాల బాటిల్‌ లో ఉండే బీపీఏ పూత పిల్లలను జబ్బు బారిన పడేటట్లు చేస్తాయి.
బాటిల్స్‌ ను ఎంచుకునే విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. బాటిల్‌ కు ఎప్పుడూ కూడా చిన్న రంధ్రం ఉన్నదే చూసుకోవాలి.

పక్కనే ఉండాలి..

పెద్ద రంధ్రం ఉంటే కనుక పాలు ఒకేసారి వచ్చేసి పిల్లలకు ఊపిరి ఆడకుండా చేస్తుంది. అంతే కాకుండా పిల్లలను ఎలా పడితే అలా ఉంచి పాలు పట్టకూడదు. బిడ్డను ఒడిలో పడుకోబెట్టుకుని కింద ఓ చేతిని వేసి తాగించాలి. అలాగే పిల్లలు పడుకున్నప్పుడు వారి చేతికి డబ్బాను ఇవ్వకూడదు. పిల్లలు పాలు తాగేటప్పుడు పెద్ద వారు కచ్చితంగా పక్కనే ఉండాలి.

Also read: ట్రంప్‌గారి నిర్వాకం.. 17వేల మంది బలి..! ఆ మెడిసిన్‌ సంజీవని కాదు.. మృత్యువుకు దారి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు