Vizag: బిడ్డను కాపాడుకోవడానికి.. తండ్రి పడిన కష్టం చూస్తే కన్నీళ్లు ఆగవు!

కేజీహెచ్ లో కన్నీరు పెట్టించే ఘటన చోటు చేసుకుంది. నెలలు నిండకముందే పుట్టిన ఓ పసికందును ఎన్ఐసీయూకు తరలించాల్సి రాగా.. సిబ్బంది లేకపోవడంతో తండ్రి సిలిండర్ మోయాల్సి వచ్చింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

New Update
Vizag: బిడ్డను కాపాడుకోవడానికి.. తండ్రి పడిన కష్టం చూస్తే కన్నీళ్లు ఆగవు!

Father Struggling For Baby: కేజీహెచ్ లో నెలలు నిండక ముందే పెట్టిన బిడ్డను కాపాడుకోవడానికి ఓ తండ్రి పడిన కష్టం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణిని కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కేజీహెచ్ ప్రసూతి (KGH Hospital) విభాగంలో చేర్పించారు. అయితే.. నెలలు నిండకుండానే ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ శిశువును పిల్లల వార్డుకు అనుబంధంగా ఉన్న ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు.

దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టి ఎన్ఐసీయూకు తరలించాల్సి వచ్చింది. అయితే.. సిబ్బంది లేకపోవడంతో నర్సు బిడ్డను పట్టుకొని ముందు నడుస్తుండగా.. శిశువు తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ ను భుజాన మోసుకుంటూ ఆమె వెంట నడిచారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. సరైన సిబ్బంది లేకపోవడంపై నెటిజన్లు ఆస్పత్రి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ శివానంద ఆరా తీశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు