ACCIDENT: ఎమ్మెల్యే లాస్య చనిపోయిన చోటే మరో దారుణం.. పల్టీలు కొట్టిన కారు!

బీఆర్ఎస్ తెలంగాణ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించినచోటే మరో దారుణం జరిగింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్‌చెరు వెళ్తున్న కారు కంట్రలోతప్పి పల్టీలు కొట్టడంతో ఒకరు మరణించారు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల వివరాలు తెలియాల్సివుంది.

New Update
ACCIDENT: ఎమ్మెల్యే లాస్య చనిపోయిన చోటే మరో దారుణం.. పల్టీలు కొట్టిన కారు!

PATANCHERU ACCIDENT: తెలంగాణ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి మరవకముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మరో ఘోరమైన రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. మేడ్చల్ నుంచి పటాన్‌చెరు వెళ్తున్న ఓ కారు సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండ వద్ద పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టి..
మంగళవారం ఉయదం మేడ్చల్ నుంచి పటాన్‌చెరు వెళ్తున్న కారు పటాన్‌చెరు ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై అతివేగంగా డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. కారు కంట్రోల్ తప్పి రోడ్డుకు అవతలి వైపు పల్టీలుకొట్టడంతో ఒకరు అక్కడిక్కడే చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. విషయం తెలియగానే ఘటన స్థలానికి చేరకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పటాన్ చెరు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో విటారా బ్రీజా కారు నుజ్జునుజ్జు అయినట్లు తెలిపారు. బాధితుల వివరాలు తెలియాల్సివుంది. అయితే రింగు రోడ్డుపై వరుస ప్రమాదాలు సంభవించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Karimnagar : ఓ వెధవ.. ఓట్ల బిచ్చగాడ.. బండిని పొట్టు పొట్టు తిట్టిన పొన్నం!

ఇన్నర్ పార్ట్స్ డ్యామేజ్..
ఇక ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం మాటల్లేకుండా చేసింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు పై ఆమె ప్రయాణిస్తున్న ఆమె కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడానికి ప్రధానంగా మూడు కారణాలు చెబుతున్నారు. మొదటిది సేఫ్టీ రేటింగ్ తక్కువ ఉన్న కారులో ప్రయాణం. లాస్య నందిత సీటు బెల్టు వేసుకోకపోవడం మరో కారణం. దీంతో ప్రమాదం జరగగానే ఆమె ముందుకు బలంగా పడిపోవడంతో తలలోని ఇన్నర్ పార్ట్స్ డ్యామేజ్ అయ్యాయి. దీంతో ఆమె అక్కడిక్కడే మరణించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terrorist Attack: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

జమ్మూకశ్మీర్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు పాక్ ఈ దాడి చేయించిందని అధికారులు అంటున్నారు. ఇది కశ్మీర్‌లో వేలాది కుటుంబాలను ప్రభావితం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకుల రాకతోనే జీవనోపాధి పొందుతున్నవారి జీవితాలు ప్రశ్నార్థకమయ్యాయి.

New Update

Pahalgam Terrorist Attack: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కశ్మీర్ లోయలోని సామాన్య ప్రజల జీవితం, జీవనోపాధికి తీవ్ర సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. ఈ దాడిలో ఉగ్రవాదులు నిరాయుధులైన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పి చంపారు. దీంతో కశ్మీర్‌ లో పర్యాటకం ద్వారా జీవనోపాధి పొందుతున్న కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 

కశ్మీర్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం...

ఈ దాడిపై జమ్మూ కశ్మీర్ మాజీ పోలీసు చీఫ్ ఎస్పీ వైద్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మూడు దశాబ్దాలుగా లోయలో సేవలందించిన ఆయన.. ఈ దాడిని విదేశీ ఉగ్రవాదుల పనిగా అభివర్ణించారు. 'స్థానిక ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేయడానికి వెనుకాడతారు. ఎందుకంటే అది కశ్మీర్ ఆర్థిక వ్యవస్థ, ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో వారికి తెలుసు' అని ఆయన అన్నారు. ఇక లోయలో ఉనికిని వ్యాప్తి చేయాలనుకుంటున్న పాకిస్తాన్ ఆదేశం మేరకు ఈ దాడి జరిగిందని, పర్యాటకులపై దాడి లోయకు పెద్ద దెబ్బ అని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకునేవారు, కానీ ఇప్పుడు పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడం ప్రమాదకరమైన కొత్త వ్యూహంగా ఆయన పేర్కొన్నారు.

వేలాది కుటుంబాలు ప్రభావితమవుతాయి..

ఈ దాడి కశ్మీర్‌లోని వేలాది కుటుంబాలను ప్రభావితం చేస్తోంది. హోటల్ నిర్వాహకులు, గైడ్‌లు, చిన్న దుకాణదారులు, పర్యాటకుల రాకతోనే జీవనోపాధి పొందుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే వీరికి పర్యాటకమే జీవనాధారం. అయితే ఈ దాడి తర్వాత పర్యాటకులు తమ బుకింగ్‌లను రద్దు చేసుకుంటారు. హోటళ్లు ఖాళీ అవుతాయి. ప్రజలు కశ్మీర్‌కు రావడానికి భయపడతారని తెలిపారు. అయితే పాకిస్తాన్  కోరుకుంటోంది కూడా ఇదే అన్నారు. 

ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్..

ఢిల్లీ మాజీ పోలీసు చీఫ్, CRPF జమ్మూ కశ్మీర్ జోన్ మాజీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ SN శ్రీవాస్తవ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. 'ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాద సంస్థలపై ప్రధాన చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ దాడితో కశ్మీర్‌లో తమ ఉనికిని కొనసాగించాలని పాకిస్తాన్ కోరుకుంటోంది. కశ్మీరీలకు పర్యాటకమే ప్రధాన జీవనాధారం. ఇలాంటి దాడులు పర్యాటకాన్ని నాశనం చేయడం కోసమే. ఇదొక కుట్రలో భాగమే. భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నా' అన్నారు.

దీనికి సైన్యం స్పందిస్తుందని..

జమ్మూ కశ్మీర్‌లో ఐదుసార్లు సేవలందించిన లెఫ్టినెంట్ జనరల్ కె. హిమాలయ సింగ్ (రిటైర్డ్) సైతం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దాదాపు 25-30 సంవత్సరాల తర్వాత పర్యాటకులపై దాడులు మళ్లీ ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. 'ఇలాంటి సంఘటనలు 1990లలో జరిగాయి. కానీ గత రెండు, మూడు దశాబ్దాలలో పర్యాటకులు సురక్షితంగా ఉన్నారు. ఈ దాడి ఒక పెద్ద ముప్పు. దీనికి సైన్యం సమాధానం ఇస్తుంది' అని చెప్పారు.

 jammu kashmir attack | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment