Delhi: ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి ఈరోజు కన్నుమూశారు. ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. భరతనాట్యం, కూచిపూడి నర్తకిగా యామినీ కృష్ణమూర్తి పేరు గడించారు. By Manogna alamuru 03 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి Yamini Krishnamurthy: డాన్స్ పేరు చెప్పగానే యావత్ భారతదేశం గుర్తు చేసుకునే పేరు యామినీ కృష్ణమూర్తి. కొన్ని దశాబ్దాలుగా ఆమె నృత్యానికి సేవ చేస్తూనే ఉన్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940లో యామినీ కృష్ణమూర్తి జన్మించారు. 1957లో తన 17 ఏళ్ళ ప్రాంలో ఆమె మద్రాస్‌లో రంగప్రవేశం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకి అనే అరుదైన గౌరవాన్ని కూడా ఆమె దక్కించుకున్నారు. ఆమెను కూచిపూడి నృత్య రూపానికి టార్చ బేరర్ అని కూడా పిలుస్తారు. యామినీ కృష్ణమూర్తి దగ్గర నృత్యం నేర్చుకున్న ఎందరో విద్యార్ధులు పెద్ద కళాకారులుగా కీర్తి గడిస్తున్నారు. ఢిల్లీలోని హౌజ్‌ఖాస్‌లోని యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్‌లో యువ నృత్యకారులకు ఆమె పాఠాలు నేర్పారు. 1968లో పద్మశ్రీ, 2001లో పద్మ భూషణ్, 2016లో పద్మ విభూషణ అవార్డులతో యామినీ కృష్ణమూర్తిని భారతదేశ ప్రభుత్వం సత్కరించింది. వీటితో పాటూ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అత్యున్నత పౌర పురస్కారం కూడా లభించింది. 84 ఏళ్ళ వయసులో ఆమె తన తుదిశ్వాసను విడిచారు. Also Read: AP News: ఆ అధికారులను వదిలే ప్రస్తక్తే లేదు.. చంద్రబాబు మాస్ వార్నింగ్! #died #dancer #yamini-krishna-murthy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి