పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. కాల్పులు జరిపిన పోలీసులు

చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటన తీవ్ర ఉద్రిక్తకరంగా మారింది. చంద్రబాబు పుంగనూరు రాకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. చంద్రబాబు వాహనంపై రాళ్లదాడి చేశారు. దీంతో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది.

New Update
పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. కాల్పులు జరిపిన పోలీసులు

చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పుంగనూరు వెళ్లారు. చంద్రబాబు నాయుడు వస్తున్న విషయాన్ని తెలుసుకున్న వైసీపీ శ్రేణులు పుంగనూరు నుంచి అంగళ్లుకు వెళ్లే రోడ్డుపై వాహనాన్ని అడ్డుగా పెట్టారు. చంద్రబాబు నాయుడు పుంగనూరు రాకుండా రోడ్డుపై బైఠాయించి వైసీపీ శ్రేణులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబు నాయుడి కాన్వాయ్‌ని అడ్డుకున్న వైసీపీ నేతలు.. ఆయన వాహనంపై రాళ్ల దాడికి దిగారు. దీంతో చంద్రబాబు కాన్వాయ్‌లోని పలు వాహనాల అద్దాలు ధ్వంసం కాగా.. పలువురు టీడీపీ నేతలుకు, పోలీసులకు గాయాలయ్యాయి. అంతే కాకుండా వైసీపీ నేతలు పలు వాహనాలకు నిప్పంటించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో దశ డీఎస్పీ ప్రసాద్, సీసీఎస్ సీఐకి గాయాలయ్యాయి.

మరోవైపు అక్కడకు చేరుకున్న టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. చంద్రబాబు నాయుడు రాకుండా వైసీపీ నేతలు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జి చేశారు. దీంతో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసుల లాఠీఛార్జిపై స్పందించిన చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలకు స్వేచ్ఛలేకుండా పోయిందన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తాను ఎక్కడా చూడలేదని ఆయన మండిపడ్డారు. మరోవైపు పోలీసులు వైసీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించలేదని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ నేతల కింద పోలీసులు కుక్కల్లా మారిపోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాజెక్ట్‌ను పరిశీలిస్తే తన బాగోతం ఎక్కడ బయటడుతుందోనని జగన్‌ భయపడుతున్నారన్నారని చంద్రబాబు విమర్శించారు.

publive-image

publive-image

publive-image

రాష్ట్ర వ్యాప్తంగా 2014 తర్వాత టీడీపీ నిర్మించిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో.. ప్రస్తుతం కూడా అలాగే ఉన్నాయన్నారు. ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందన్నారు. వైసీపీ రౌడీలు టీడీపీ నేతలపై దాడులు చేస్తుంటే పోలీసులు చూస్తూ ఉండిపోయారన్న చంద్రబాబు.. పోలీసులు యూనిఫామ్‌ వేసుకున్న రౌడీలుగా మారారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు, లోకేశ్‌ల పర్యటనల్లో పోలీసులు కల్పిస్తున్న భద్రతపై నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు కాన్వాయ్ పై ఇటీవల జరిగిన దాడులపై కేంద్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబర్ 4న చంద్రబాబు ర్యాలీపై రాళ్ల దాడిపైన తెదేపా ఎంపీ కనకమేడల ఫిర్యాదు చేశారు. దీనితో స్పందించిన కేంద్ర హోంశాఖ నివేదిక కోరింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు