Crime : ఉదయగిరి కోట పై గుప్త నిధుల కోసం తవ్వకాలు!

నెల్లూరు జిల్లా ఉదయగిరి దుర్గం కొండ పై గుప్త నిధులు తవ్వకాల కోసం దాచి ఉంచిన సామాగ్రిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా రాత్రి పూట దుర్గం కొండ పై గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

New Update
Crime : ఉదయగిరి కోట పై గుప్త నిధుల కోసం తవ్వకాలు!

Udayagiri : నెల్లూరు జిల్లా (Nellore District) ఉదయగిరి దుర్గం కొండ పై గుప్త నిధులు (Hidden Treasures) తవ్వకాల కోసం దాచి ఉంచిన సామాగ్రిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా రాత్రి పూట దుర్గం కొండ పై గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో అటవి శాఖ రేంజ్ అధికారి ఉమామహేశ్వర్ రెడ్డి మూడు బృందాలను ఏర్పాటుచేసి గాలింపు చర్యలు చేపట్టారు. యాత్రికులు (Pilgrims), పర్యాటకులు (Tourists) రూపంలో దుర్గం కొండపై పర్యటించి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారన్న సమాచారం పోలీసులకు వచ్చింది.

కొండపైన పెద్ద మసీదు సమీపంలోని కోనేరు లో ఈ తవ్వకాలు చేసిన విషయాన్ని కూంబింగ్ లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతానికి కొంత దూరంలోనీ రాళ్లగుట్టలో తవ్వకాల కోసం దాచి ఉంచిన డ్రిల్లింగ్ మిషన్ లు, సమ్మెటలను ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతమంతా పురావస్తు శాఖ పరిధిలో ఉందని పోలీసు, పురావస్తు శాఖ సమన్వయంతో కేసు నమోదు చేస్తామని తెలిపారు. గుప్త నిధుల తవ్వకాల విషయంలో కొందరు స్థానికుల పై అనుమానం ఉందని వారికి నోటీసులు జారీ చేసి విచారణ చేస్తామని తెలిపారు.

Also read: తెగిన రోడ్లు.. కొట్టుకుపోయిన కార్లు.. వరద బీభత్సం

Advertisment
Advertisment
తాజా కథనాలు