YS Jagan-Roja : ఓటమి తర్వాత తొలిసారి జగన్ ను కలిసిన రోజా.. ఆ నేతలపై ఫిర్యాదు? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో పలువురు ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు కలిశారు. జగన్ ను కలిసిన వారిలో మాజీ మంత్రి రోజా, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. By Nikhil 19 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Roja Meets Ex. CM Jagan : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో (Elections) పోటీ చేసిన అభ్యర్థులతో నిత్యం సమావేశం అవుతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు మాజీ మంత్రి, నగరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన రోజా, కావలి అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు ఈ రోజు జగన్ (YS Jagan) తో భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి, అనంతరం పరిణామాలను వారు జగన్ వివరించినట్లు సమాచారం. నేతలు ఎవరూ అధైర్య పడొద్దని ఈ సందర్భంగా జగన్ సూచించినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఓడినా 40 శాతం ఓట్లు వైసీపీ (YCP) కి వచ్చాయని.. కష్టపడితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడం పెద్ద కష్టమైన విషయం కాదని జగన్ వారితో అన్నట్లు తెలుస్తోంది. నగరిలో సొంత పార్టీ నేతలే తన ఓటమికి ప్రయత్నించారని జగన్ కు రోజా (Roja) ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలోనూ రోజా ఈ విషయంపై బహిరంగంగానే వ్యాఖ్యానించారు. తాజాగా జగన్ కు ఈ విషయాన్ని వివరించినట్లు వైసీపీ వర్గాల నుంచి తెలుస్తోంది. ప్రత్యర్థులపై మాటలతో దాడి చేస్తూ వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా.. ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఓటమి తర్వాత ఆమె ఎక్కడా కనిపించలేదు. మీడియాతో కూడా మాట్లాడలేదు. తాజాగా జగన్ కలిసేందుకు వచ్చారు. Your browser does not support the video tag. Also Read : రేపు అమరావతికి చంద్రబాబు.. ఆ ప్రాంతాన్ని పరిశీలించనున్న సీఎం.! #ys-jagan #ap-ycp #roja #ap-elections-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి