KCR: ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్‌!

మూడో రోజు శాసనసభ సమావేశాల్లో.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష నేతగా దాదాపు ఏడు నెలల తర్వాత తొలిసారిగా గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు.గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ తొలిసారి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు

New Update
KCR: ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్‌!

KCR to Attend Telangana Assembly: మూడో రోజు శాసనసభ సమావేశాల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాబోతుంది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష నేతగా దాదాపు ఏడు నెలల తర్వాత తొలిసారిగా గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. అసలు అధికార పార్టీని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారనే చర్చ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. బడ్జెట్ సమావేశాల రోజు కేసీఆర్ హాజరు కావడంతో మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారో, మైక్ ఇస్తారా లేదా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. పదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హఠాత్తుగా ప్రతిపక్షంలో కూర్చున్న ఆయన అసలు సభలో ఉంటారో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ తొలిసారి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన పరిణామాలు బీఆర్‌ఎస్‌ను కుదేలు చేశాయి. అనారోగ్యం కారణంగా గత రెండు సమావేశాల్లో పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కనిపించలేదు. విడిగా ప్రమాణం కూడా చేశారు. ఈ అధికార పార్టీకి ఆయుధం కావాలంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి స్పీచ్ ఇవ్వాల్సిందేనని విమర్శించేవారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు కేసీఆర్ శాసనసభ సమావేశాలకు రాకపోవడంపై పదేపదే ప్రస్తావిస్తున్నారు.

ఇటీవల బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రెండు రోజులు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అవ్వలేదు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అయితే ముందుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు వస్తామని ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం నేడు శాసనసభ సమావేశానికి మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. బడ్జెట్ పై ప్రసంగించన్నారు.

Also Read: తిరుపతి లో దారుణం..ముగ్గురిని హత్య చేసిన సాఫ్ట్‌వేర్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు