ఆసుపత్రికి రావద్దు.. కేసీఆర్ సంచలన వీడియో

యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ ఓ వీడియో విడుదల చేశారు. తనను చూసేందుకు వస్తున్న అభిమానులు, కార్యకర్తలను ఆసుపత్రికి రావద్దని పేర్కొన్నారు.

New Update
ఆసుపత్రికి రావద్దు.. కేసీఆర్ సంచలన వీడియో

Ex-CM KCR: బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకు సందేశం పంపారు. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్.. తన ఆరోగ్య పరిస్థితి గురించి తెకుసుకొని పరామర్శించడానికి యశోద దవాఖానకు తరలివస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

దీనికి సంబంధించి ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో కేసీఆర్ మాట్లాడుతూ.. 'తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ నడుమకే వస్తానని అప్పడిదాకా సంయమనం పాటించి యశోద దవాఖానకు రావొద్దని తనతో పాటు వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్ లో ఉన్నందున మన వల్ల వారికి ఇబ్బంది కలగకూడదని ప్రజలను వేడుకున్నారు. త్వరలోనే కోలుకొని మీ ముందుకు వస్తానని పేర్కొన్నారు. దీనిని ప్రజలు గమనించాలని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు