EX MLA Saidi Reddy: బీజేపీలోకి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి..! బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈయనను బీజేపీ నుంచి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. By B Aravind 01 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి EX MLA Saidi Reddy: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అధికార, విపక్ష నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారిపోతున్న సందర్భాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలోకి చేరనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈయనను బీజేపీ నుంచి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీజేపీ ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది. Also Read: మనదేశంలో అత్యంత ఖరీదైన పెళ్లిల్లు ఇవే.. ఎంపీ బీబీ పాటిల్ రాజీనామా అయితే ఖమ్మం నుంచి కూడా మరో సీనియర్ బీఆర్‌ఎస్ నేతను చేర్చుకునేలా బీజేపీ ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు (KCR) పంపారు. తాజాగా ఆయన తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. నిన్న (గురువారం) బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎంపీ రాములు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. వరుస నేతల రాజీనామాలతో బీఆర్ఎస్ పార్టీ మెల్లగా ఖాళీ అవుతోంది. ఇటీవల మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో కుటుంబ సమేతంగా కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ తదితర బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఖాళీ అవుతోన్న బీఆర్‌ఎస్ తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు సొంత పార్టీ నేతలనే కాపాడుకోవడమే పెద్ద తలనొప్పిగా మారింది. బీఆర్ఎస్ కి రాజీనామా చేసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు కొందరు నేతలు. అయితే.. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నేతల రాజీనామాలు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. Also Read: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన తొలగించిన బోర్డ్ #brs #bjp #nalgonda-news #saidi-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి