Govt jobs 2023: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. వేయికి పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్..!! న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC Recruitment 2023)ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాలు లేదా ఆసుపత్రుల్లో 1038 పారమెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రీజియన్ లో మొత్తం 70ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హతతోపాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అక్టోబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీల్లో ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. By Bhoomi 02 Oct 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ESIC Recruitment 2023: న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (Employees' State Insurance Corporation) ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాలు లేదా ఆసుపత్రుల్లో 1038 పారమెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రీజియన్ లో మొత్తం 70 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హతతోపాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అక్టోబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీల్లో ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కేటగిరీ వారిగా పోస్టుల వివరాలు : -ఈసీజీ టెక్నీషియన్ - జూనియర్ రేడియోగ్రాఫర్, -జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్, -మెడికల్ రికార్డు అసిస్టెంట్, -ఓటీ అసిస్టెంట్, -ఫార్మసిస్ట్ రేడియో గ్రాఫర్, -సోషల్ గైడ్, - సోషల్ వర్కర్ ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో 670 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నిరుద్యోగులకు మంత్రి శుభవార్త రీజియన్లవారీగా ESIC లో ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే -బిహార్: 64 - చండీగఢ్, పంజాబ్: 32 -ఛత్తీస్‌గఢ్: 23 - ఢిల్లీ ఎన్‌సీఆర్: 27 -గుజరాత్: 72 -హిమాచల్ ప్రదేశ్: 06 -జమ్ము అండ్ కశ్మీర్: 09 - ఝార్ఖండ్: 17 -కర్ణాటక: 57 -కేరళ: 12 -మధ్యప్రదేశ్: 13 -మహారాష్ట్ర: 71 - నార్త్ ఈస్ట్: 13 - ఒడిశా: 28 - రాజస్థాన్: 125 -తమిళనాడు: 56 - తెలంగాణ: 70 - ఉత్తర్ ప్రదేశ్: 44 - ఉత్తరాఖండ్: 09 -పశ్చిమ్ బెంగాల్: 42 ఇది కూడా చదవండి: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్న్యూస్…ఈ శాఖలో 8 వేల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్..!! అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, సర్టిఫికేట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. ఎంపిక విధానం: రాత పరీక్ష, టైపింగ్/ డేటా ఎంట్రీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలక్ట్ చేస్తారు. రాత పరీక్ష విధానం: మొత్తం 100 ప్రశ్నలకుగాను 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో టెక్నికల్/ ప్రొఫెషనల్ నాలెడ్జ్-50 ప్రశ్నలు-100 మార్కులు, జనరల్ అవేర్‌నెస్-10 ప్రశ్నలు-10 మార్కులు, జనరల్ఇంటెలిజెన్స్-20 ప్రశ్నలు- 20 మార్కులు, అరిథ్‌మెటిక్ ఎబిలిటీ-20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. సమయం 120 నిమిషాలు. ముఖ్యమైన తేదీలు... -ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01.10.2023. -ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.10.2023. Official Website Apply Online #rtvlive-com #latest-jobs-in-telugu #esic-jobs #govt-jobs-2023 #esic-recruitment-2023 #esic-paramedical-staff-recruitment-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి