Mechanic Rocky: విశ్వక్‌ సరసన కోలీవుడ్ బ్యూటీ.. 'మెకానిక్‌ రాకీ' అప్డేట్ ..!

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మెకానిక్‌ రాకీ'. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో కోలీవుడ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ మరో ఫిమేల్ లీడ్ గా నటించనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update
Mechanic Rocky:  విశ్వక్‌ సరసన కోలీవుడ్ బ్యూటీ.. 'మెకానిక్‌ రాకీ' అప్డేట్ ..!

Mechanic Rocky: మాస్ కా దాస్ విశ్వక్ వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బ్యాక్ బ్యాక్ హిట్స్ తర్వాత ‘మెకానిక్‌ రాకీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన విశ్వక్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

publive-image

శ్రద్ధ శ్రీనాథ్ ఆన్ బోర్డు

అయితే తాజాగా మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ కూడా ఫిమేల్ లీడ్ గా మరో కీలక పాత్రలో నటించనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ మూవీలో విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తున్న సంగతి తెలిసిందే. విశ్వక్ మాస్‌ యాక్షన్‌ ‘మెకానిక్‌ రాకీ’ దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న విడుదల కానున్నట్లు ప్రకటించారు.

Also Read: Viral Video: అనిరుధ్ కన్నా నువ్వే తోపు.. గల్లీ కుర్రోడి మ్యూజిక్ కు నెటిజన్లు ఫిదా! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు