Viduthalai: క్రిస్మస్ బరిలో విజయ్ సేతుపతి 'విడుతలై' పార్ట్ 2...! విజయ్ సేతుపతి- వెట్రిమారన్ కాంబోలో రాబోతున్న తమిళ్ ఫిల్మ్ 'విడుతలై2'. తెలుగులో 'విడుదల' అనే పేరుతో రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 26న తమిళ్ తో పాటు తెలుగులో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. By Archana 29 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Viduthalai: కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ముందుకెళ్తున్నారు. ఇటీవలే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మహారాజ' సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నారు. తండ్రి, కూతుళ్ళ సెటిమెంట్ తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ సేతుపతి-కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కాంబోలో రూపొందుతున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ 'విడుతలై' పార్ట్ 2. తమిళ్ లో సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'విడుతలై' పార్ట్ 1 సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 'విడుతలై' పార్ట్ 2 రిలీజ్ సెట్ ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 26న తమిళ్, తెలుగు, ఇతర భాషల్లోనూ విడుదల కానున్నట్లు ప్రకటించారు. తెలుగులో విడుదల అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే క్రిస్మస్ కానుకగా రామ్ చరణ్- శంకర్ గేమ్ చేంజర్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమాల మధ్య క్లాష్ గట్టిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. Mark your calendars! Maverick director #VetriMaaran’s #ViduthalaiPart2 is coming to theatres on December 20, 2024.#ViduthalaiPart2FromDec20 An @ilaiyaraaja Musical @sooriofficial @elredkumar @rsinfotainment @GrassRootFilmCo @ManjuWarrier4 @BhavaniSre @anuragkashyap72… pic.twitter.com/3GQUpSXOvw — VijaySethupathi (@VijaySethuOffl) August 29, 2024 Also Read: Coolie: రజినీ కాంత్ 'కూలీ' లో కింగ్.. నాగార్జున లుక్ అదిరింది..! - Rtvlive.com #viduthalai #vijay-sethupathi సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి