VD12: విజయ్ లుక్ చూస్తే షాకే..! 'VD12' ఫస్ట్ లుక్ పోస్టర్ విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో రాబోతున్న లేటెస్ట్ ఫిల్మ్ 'VD12'. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని మార్చి 28న 2025లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. By Archana 02 Aug 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి VD12: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి కాంబోలో ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు తెరకెక్కుతోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం శ్రీలంకలో చిత్రీకరణ జరుపుకుంటోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘VD12’ పోస్టర్, రిలీజ్ డేట్ అయితే తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని 2025 మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా అఫీషియల్ టైటిల్ ను త్వరలో అనౌన్స్ చేయనున్నట్లు తెలిపారు. ఇక పోస్టర్ లో విజయ్ దేవరకొండ లుక్ హైలెట్ గా కనిపించింది. వర్షంలో తడిసిన విజయ్ రక్తపు మరకలతో అరుస్తున్న ఈ లుక్ చాలా టెర్రిఫిక్ అండ్ ఇంటెన్సివ్‌గా ఉంది. అతని కోసం విధి ఎదురుచూస్తుంది.. రక్తపాతం వేచి ఉంది.. కొత్త రాజు ఉదయిస్తాడు అంటూ పవర్ ఫుల్ క్యాప్షన్ తో పోస్టర్ రిలీజ్ చేశారు. Destiny calls, Bloodshed awaits, A new king shall rise.🔥#VD12 in Cinemas Worldwide from 28th March 2025! 🤩❤️🔥 Title Announcement This August! 💥@TheDeverakonda @anirudhofficial @gowtam19 #GirishGangadharan @vamsi84 #SaiSoujanya @dopjomon @NavinNooli @artkolla @SitharaEnts… pic.twitter.com/aaLeDG3Vf2 — Sithara Entertainments (@SitharaEnts) August 2, 2024 Also Read: Ram Charan- Upasana: క్లీంకార కేర్ టేకర్ మాటలు వింటే చెర్రీని మెచ్చుకోకుండా ఉండలేరు 🥰.. ఏం అన్నారంటే? – Rtvlive.com #vd12 #hero-vijay-devarakonda మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి