This Week Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్స్ లో సినిమాల సందడి.. లిస్ట్ ఇదే..?

ఈ వారం థియేటర్, ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి పలు సినిమాలు, సీరీస్ లు సిద్ధంగా ఉన్నాయి. ధనుష్ 'రాయన్', రక్షిత్‌ అట్లూరి ‘ఆపరేషన్‌ రావణ్‌’, రాజ్‌ తరుణ్ ‘పురుషోత్తముడు’, యోగిబాబు 'చట్నీ సాంబార్‌' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

New Update
This Week Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్స్ లో సినిమాల సందడి.. లిస్ట్ ఇదే..?

Entertainment : ఈ వారం ఓటీటీ, థియేటర్ లో సందడి చేయబోతున్న చిత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము..

ఓటీటీ రిలీజ్

రాజు యాదవ్

జబర్దస్త్ (Jabardasth) ఫేమ్ గెటప్ శ్రీను (Getup Srinu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాజు యాదవ్’. మే 24న విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. జులై 24 నుంచి ఆహా (Aha) లో స్ట్రీమింగ్ కానుంది.

చట్నీ సాంబార్‌

తమిళ్ స్టార్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సీరీస్ ‘చట్నీ సాంబార్’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన వెబ్ సిరీస్ జులై 26 డిస్నీ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో వాణి భోజన్ క‌థానాయిక‌గా నటించగా.. కయల్‌ చంద్రన్‌, నితిన్‌ సత్య, దీపా శంకర్‌, సంయుక్త విశ్వనాథ్‌, సుందర్‌ రాజన్ తదితరులు ప్ర‌ధాన పాత్రలను పోషించారు.

భయ్యా జీ

బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయి లేటెస్ట్ మూవీ ‘భయ్యా జీ’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ Zee 5 లో జులై 26నుంచి స్ట్రీమింగ్ కానుంది.

థియేటర్ రిలీజ్ 

రాయన్

కోలీవుడ్ (Kollywood) హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ 'రాయన్'. నార్త్ మద్రాస్‌ బ్యాక్ డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో దుషారా విజయన్, సందీప్‌ కిషన్, కాళిదాస్‌ జయరామ్, అపర్ణ బాలమురళి, ప్రకాశ్‌రాజ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, సెల్వరాఘవన్, శరవణన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ లో ధనుష్ మాస్ అవతార్, యాక్షన్ సన్నివేశాలు మూవీ పై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం జులై 26న విడుదల కానుంది.

‘ఆపరేషన్‌ రావణ్‌’

రక్షిత్ అట్లూరి, సంకీర్తన విపిన్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌’. సైకో థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి వెంకట సత్య దర్శకత్వం వహించారు. సుధాస్ మీడియా బ్యానర్ పై ద్యాన్ అట్లూరి నిర్మించారు. ఈ చిత్రంలో సీనియర్ నటి రాధికా కీలక పాత్ర పోషించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీ జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘పురుషోత్తముడు’

రామ్‌ భీమన దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, హాసిని సుధీర్‌ జంటగా నటించిన చిత్రం ‘పురుషోత్తముడు’. ఈ మూవీ జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ఈ ట్రైలర్ మూవీ కామెడీ, ఎమోషన్, యాక్షన్, కుటుంబ భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Also Read: Ananth Ambani: ఈ షేర్వానీ డిజైన్ చేయడానికి అన్ని రోజులు పట్టిందా..! - Rtvlive.com



Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment