Kalki 2898AD: జవాన్ రికార్డు బ్రేక్ చేసిన కల్కి..!

ప్రభాస్ 'కల్కి'.. షారుఖ్ ఖాన్ 'జవాన్' రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.640 కోట్లు సాధించిన చిత్రంగా 'జవాన్' నాలుగో స్థానంలో ఉండగా.. తాజాగా 'కల్కి' 640.6 కోట్లతో 'జ‌వాన్' ను వెన‌క్కి నెట్టి ఆ ప్లేస్‌లో వ‌చ్చి చేరింది.

New Update
Kalki 2898AD: జవాన్ రికార్డు బ్రేక్ చేసిన కల్కి..!

Kalki 2898AD: పాన్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లకు పైగా వసూళ్లును సాధించింది. ఈ మూవీలోని విజువల్స్, స్టోరీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ మరో రికార్డు సాధించింది.

జవాన్ ను వెనక్కి నెట్టేసిన కల్కి

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రం నాలుగవ చిత్రంలో ఉండేది. ఇప్పుడు ప్రభాస్ కల్కి ఈ రికార్డును బ్రేక్ చేసింది. జవాన్ దేశవ్యాప్తంగా రూ.640 కోట్లు సాధించగా.. కల్కి 640.6 కోట్లతో 'జ‌వాన్' ను వెన‌క్కి నెట్టి ఆ ప్లేస్‌లోకి వ‌చ్చి చేరింది. రాజమౌళి బాహుబలి రూ. 1030.42 కోట్లతో ఫస్ట్ ప్లేస్, కేజీఎఫ్ 2: రూ. 859.7 కోట్లతో సెకండ్, ఉండగా.. కల్కి 2898 AD: రూ. 640.6 కోట్లు, జవాన్: రూ. 640.25 కోట్లు, యానిమ‌ల్: రూ. 553.87 కోట్లు, పఠాన్: రూ. 543.09 కోట్లు, గదర్ 2: రూ. 525.7 కోట్లు, బాహుబలి: 421 కోట్లు, రోబో 2.0: రూ. 407.05 కోట్లతో 3,4,5,6,7,8,9,10 స్థానాల్లో ఉన్నాయి.

Also Read: Rocking Rakesh : తండ్రి కాబోతున్న రాకింగ్ రాకేష్.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫోటోలు! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RGV : పోలీసులే భయపడితే..  హారర్ కామెడీ సినిమా చేస్తున్న.. ఆర్జీవీ సంచలన ప్రకటన

నిత్యం సోషల్ మీడియాలో తన ట్వీట్లతో సంచలన ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలిచే వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు. కొత్త సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు.

New Update
rgv new movie

rgv new movie

నిత్యం సోషల్ మీడియాలో తన ట్వీట్లతో సంచలన ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలిచే వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు. కొత్త సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రజలకు భయం వేస్తే పోలీసుల వద్దకు పరిగెడతారు.. అలాంటిది మరి పోలీసులే భయపడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను చేయబోతున్నట్లుగా వెల్లడించారు.  

 ఘోరమైన ఎన్‌కౌంటర్ హత్య తర్వాత

తాను ఇంతవరకు హారర్, గ్యాంగ్‌స్టర్, రొమాంటిక్, పొలిటికల్ డ్రామాలు, అడ్వెంచర్ కేపర్‌లు, థ్రిల్లర్‌ లాంటి సినిమాలు చేసాను. కానీ ఎప్పుడూ కూడా  హార్రర్ కామెడీ చేయలేదు. అందుకే ఈ చిత్రానికి ‘పోలీస్ స్టేషన్ మెయిన్ భూత్’ ట్యాగ్ లైన్: You Can't Kill The Deadతో అనే టైటిల్ పెట్టానన్నారు.  ఘోరమైన ఎన్‌కౌంటర్ హత్య తర్వాత, పోలీసు స్టేషన్  హాంటెడ్ స్టేషన్‌గా మారింది. గ్యాంగ్‌స్టర్ల దెయ్యాల నుండి తప్పించుకోవడానికి పోలీసులందరూ భయంతో పరుగులు తీస్తారంటూ ఆర్జీవీ సినిమా కాన్సెప్ట్‌ను కూడా వెల్లడించారు.

సత్య, కౌన్ స్కూల్ తర్వాత తాను బాజ్‌పేయి మనోజ్ ఇద్దరం కలిసి ఈ సినిమా చేయబోతున్నట్లుగా ఆర్జీవీ తెలిపారు. శారీ అనే చిత్రం తరువాత ఆర్జీవీ నుంచి మళ్లీ సినిమా రాలేదు.  దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంది.  

Also read : TTD: ఒంటిమిట్ట రాములోరి గుడికి.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు!

Advertisment
Advertisment
Advertisment