Kalki 2898 AD: 1000 కోట్ల దిశగా.. బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి వసూళ్ళ సునామీ..!

ప్రభాస్ కల్కి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 10 రోజుల్లోనే 800 కోట్లు వసూళ్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం తాజాగా 900 కోట్ల క్లబ్‌లో చేరింది. త్వరలోనే 1000 కోట్ల క్లబ్ లో చేరే దిశగా దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

New Update
Kalki 2898 AD: 1000 కోట్ల దిశగా.. బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి వసూళ్ళ సునామీ..!

Kalki 2898 AD Collections: ప్రభాస్(Prabhas) - నాగ అశ్విన్ 'కల్కి 2898 AD' వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రిలీజైన మొదటి రోజు నుంచి రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. మైథాలజీ - సైన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం విపరీతమైన ప్రేక్షకాదరణ పొందుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ కల్కి ర్యాంపేజ్ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లు కలెక్ట్ చేసిన కల్కి .. తాజాగా 900 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

900 కోట్ల క్లబ్ లోకి కల్కి

తాజాగా మేకర్స్ కల్కి లేటెస్ట్ కలెక్షన్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బ్లాక్ బస్టర్ కల్కి 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 900 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. త్వరలో 1000 కోట్ల క్లబ్ లో చేరే దిశగా దూసుకెళ్తున్నట్లు చిత్ర బృందం పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలోని హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ , విజువల్స్ , కథలో కొత్తదనం సినీ ప్రియులకు మంచి అనుభూతుని అందిస్తున్నాయి. నాగి సృష్టించిన ఈ కల్కి ప్రపంచం ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో కల్కి హవా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదే జోరు కొనసాగితే RRR, బాహుబలి 2, కేజీఎఫ్ (KGF) రికార్డులను బ్రేక్ చేసి కల్కి సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం.

Also Read: Manchu Manoj: మంచు మనోజ్ కూతురికి ఆసక్తికర పేరు.. క్లింకార తర్వాత మరో ఇంట్రెస్టింగ్ నేమ్! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment