Kalki 2898 AD: బాక్స్ ఆఫీస్ వద్ద 'కల్కి' బీభత్సం.. 10 రోజుల్లో 800 కోట్లు..!

ప్రభాస్ కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా మేకర్స్ కల్కి 10 రోజుల కలెక్షన్స్ అనౌన్స్ చేశారు. 10 రోజుల్లో 800 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update
Kalki 2898 AD: బాక్స్ ఆఫీస్ వద్ద 'కల్కి' బీభత్సం.. 10 రోజుల్లో 800 కోట్లు..!

Kalki 2898 AD Box Office Collections:  ప్రభాస్ - నాగ్ అశ్విన్ బ్లాక్ బస్టర్ కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. మైథాలజీ, సైన్స్ కలయికతో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. రిలీజైన మొదటి రోజు నుంచి రికార్డు వసూళ్లతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 555 కోట్ల వసూళ్లను రాబట్టింది.

పది రోజుల్లో 800 కోట్లు

తాజాగా మేకర్స్ కల్కి 10 రోజుల కలెక్షన్స్ అఫీషియల్ అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. బ్లాక్ బస్టర్ కల్కి 10 రోజుల్లో 800 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. ఇదే జోరు కొనసాగితే RRR, బాహుబలి, కేజీఎఫ్ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతి నిర్మించిన ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలు పోషించారు. మాళవిక మోహన్, విజయ్ దేవరకొండ, దుల్కర్, రాజమౌళి తదితరులు కామియో రోల్స్ లో కనిపించి మెప్పించారు.

Also Read: Ambani Wedding: కొడుకు సంగీత్ లో ముఖేష్- నీతా అంబానీ స్పెషల్ వీడియో.. మనవళ్ళతో కారులో షికారుకు..! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు