Sitara Ghattamaneni: ''ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్''... నమ్రత వీడియో వైరల్ ...! సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార పుట్టినరోజు నేడు. ఈ సందర్భగా ఆమె మదర్ నమ్రత శిరోద్కర్ బర్త్ డే విషెష్ తెలియజేస్తూ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. సితార చిన్ననాటి జ్ఞాపకాలు, చేసిన అల్లరి పనులు ఈ వీడియోలో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. By Archana 20 Jul 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Sitara Ghattamaneni టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార ఘట్టమనేని నేడు 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈరోజు కూతురు సితారా పుట్టిన రోజు సందర్భంగా ఆమె మదర్ నమ్రత శిరోద్కర్ సితారకు స్పెషల్ విషెష్ తెలియజేసింది. సితారకు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలు, ఆమె చేసిన అల్లరి పనులతో క్రియేట్ చేసిన వీడియోను షేర్ చేస్తూ కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. నమ్రత శిరోద్కర్ పోస్ట్ నమ్రత శిరోద్కర్ తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు.. "మై ఫేవరేట్ ట్రావెల్ పార్ట్ నర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. వివిధ దేశాలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. ఎల్లప్పుడూ నా చిన్ని గైడ్‌గా ఉంటూ ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకంగా చేశావు. ఆ క్షణాలు, జ్ఞాపకాలను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నా ప్రేమ నీకు ఎప్పుడూ ఉంటుంది. ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ అని తెలిపింది." View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) Also Read Saripodhaa Sanivaaram: "సరితూగే సమరమే, సంహారం తథ్యం".. ఎస్. జే సూర్య బర్త్ డే స్పెషల్..! - Rtvlive.com #namratha-shirodkar #sitara-ghattamaneni మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి