Emergency : చిక్కుల్లో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ'.. విడుదల ఆపేయాలని ఎంపీ లేఖ

కంగనా రనౌత్ లేటెస్ట్ ఫిల్మ్ 'ఎమర్జెన్సీ' విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. పంజాబ్ ఎంపీ సరబ్ జిత్ సింగ్ ఖల్సా ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. సిక్కులను తప్పుగా చూపించారని ఆరోపించారు. సినిమా విడుదలను ఆపేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

New Update
Emergency : చిక్కుల్లో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ'.. విడుదల ఆపేయాలని ఎంపీ లేఖ

Kangana Ranaut Emergency : హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) బీజేపీ (BJP) ఎంపీ, బాలీవుడ్ నటి (Bollywood Actress) కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఎమర్జెన్సీ'. ఇందిరాగాంధీ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కంగనా ఇందిరాగాంధీ ప్రాతలో పోషించింది. ఎమర్జెన్సీ సమయంలో దేశంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఆ సమయంలో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు ఏంటనే నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది.

చిక్కుల్లో కంగనా ఎమర్జెన్సీ

అయితే ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ లో కొన్ని సన్నివేశాలపై పంజాబ్ ఫరీద్ కోట్ ఎంపీ సరబ్ జిత్ సింగ్ ఖల్సా అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో సిక్కులను తప్పుగా చూపించారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. సరబ్ జిత్ సింగ్ ఖల్సా బియాంత్ సింగ్ కుమారుడు. బియాంత్ సింగ్ 1984 అక్టోబర్ 31న ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో ప్రధాని ఇందిరాగాంధీని కాల్చి చంపిన ఇద్దరు బాడీగార్డుల్లో ఒకరు. కాగా, ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

జీ స్టూడియోస్ & మణికర్ణిక ఫిల్మ్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కంగనా రనౌత్, రేణు పిట్టి, ఉమేష్ Kr బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మిలింద్ సోమన్, మహిమా చౌదరి, విశాక్ నాయర్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Also Read: Emergency Trailer: కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' ట్రైలర్..! - Rtvlive.com 

Advertisment
Advertisment
తాజా కథనాలు