/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-30T112533.417.jpg)
Urvashi Rautela : ఇటీవలే బాలీవుడ్ (Bollywood) నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) బాత్రూం వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరలైంది. ఇందులో ఊర్వశి రెస్ట్‌రూమ్‌లో బట్టలు విప్పుతున్నట్లు కనిపించింది. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో.. దీని పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు డీప్ ఫేక్ వీడియో (Deep Fake Video) అని కొట్టిపారేయగా.. మరికొందరు సినిమా ప్రమోషన్స్ స్టెంట్ అని కూడా అన్నారు.
View this post on Instagram
బాత్రూం వీడియో ఊర్వశీ క్లారిటీ
అయితే తాజాగా నటి ఊర్వశీ ఈ వీడియో పై స్పందించారు. "ఆ వీడియో నిజమేనని చెప్పింది. కానీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కాదని. తన నెక్స్ట్ మూవీ ‘ఘుస్పైఠియా’ సినిమాలోని ఓ సీన్ అని. నిజంగా స్నానం చేస్తున్నప్పుడు తీసిన వీడియో కాదని క్లారిటీ ఇచ్చింది. అది సినిమా కోసం మాత్రమే చేసిందని. దాన్ని ఎవరో సోషల్ మీడియాకు లీక్ చేశారని.. నిరాశను వ్యక్తం చేసింది ఊర్వశి."
‘ఘుస్పైఠియా’
‘ఘుస్పైఠియా’లో ఊర్వశి, అక్షయ్ ఒబ్రాయ్, వినీత్ కుమార్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఒక వ్యక్తి విశ్వాసం, గోప్యతపై సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంది..? అనే నేపథ్యంలో ఈ చిత్రం రాబోతుంది. సుశి గణేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 9న విడుదల కానుంది. ఊర్వశి తెలుగులో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'NBK109' చిత్రంలో బాలయ్య సరసన నటిస్తోంది.
View this post on Instagram
Also Read:Janhvi Kapoor: తల్లి సినిమాలపై జాన్వీ సంచలనం.. ఏమన్నారంటే? - Rtvlive.com