/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-11T161848.965.jpg)
Girls Marriage: ఇంగ్లాండ్ కు చెందిన మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ (Danni Wyatt), జార్జి హాడ్జ్ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట.. జూన్ 10న లండన్‌లోని చెల్సియా ఓల్డ్ టౌన్ హాల్‌లో ఘనంగా పెళ్లి చేసుకుంది. ఈ గుడ్ న్యూస్ ను తమ అభిమానులతో పంచుకుంటూ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Making it official! 🤍 Roll on Pt.2 in 🇫🇷 💍 💒 pic.twitter.com/rmsHlCukQF
— Danielle Wyatt (@Danni_Wyatt) June 10, 2024
2019 నుంచి డేటింగ్..
ఇక గతేడాది ప్రేయసితో తన ఎంగేజ్‌మెంట్ గురించి ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది వ్యాట్. 2019 నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉండగా.. 2023 మార్చిలో దక్షిణాఫ్రికాలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కాగా వ్యాట్ ప్రియురాలు జార్జి హాడ్జ్ (Georgie Hodge).. సీఏఏ బేస్‌కు చెందిన ఓ మహిళా ఫుట్‌బాల్ జట్టుకు హెడ్‌గా పనిచేస్తున్నారు. లండన్‌లో ఎఫ్‌ఏ లైసెన్స్‌డ్ ఏజెంట్‌గానూ వ్యవహరిస్తోంది. 33 ఏళ్ల వ్యాట్.. ఇంగ్లాండ్ తరఫున ఇప్పటి వరకు 105 వన్డేలు, 151 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది.
ఇదిలాఉంటే.. 2014లో టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సరదాగా ప్రపోజ్ చేసి అప్పట్లో వార్తల్లో నిలిచింది. గతంలోనూ 2022లో ఇంగ్లాండ్ క్రికెటర్లు కేథరిన్ బ్రంట్, నటాలియా సీవర్ పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు న్యూజిలాండ్ మహిళా క్రికెటర్లు అమీ సాటర్త్‌వైట్ - తహుహు, దక్షిణాఫ్రికా క్రికెటర్లు మరిజేన్ కాప్, డాన్ నీకెర్క్ కూడా పెళ్లితో ఒక్కటయ్యారు.