Squirrels: అంతరించిపోతున్న ఉడతలు.. ఫారెస్ట్ అధికారులు ఏం చేశారంటే..? పశ్చిమ బెంగాల్‌లో ఉడుతలు అంతరించిపోతున్నాయి. చెట్ల మీద నివాస ఉండే అందమైన ప్రాణిని వేటగాళ్లు డబ్బు కోసం ఉడుతలను చంపేసి, ఉడుతల వెంట్రుకలు, చర్మాన్ని అమ్ముకుంటున్నారు. క్రమంగా తగ్గుముఖం పడతున్న ఉడుతలనూ చూసి గ్రామంలోని ప్రజలు వాపోతున్నారు. By Vijaya Nimma 12 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Squirrels: ఉడత అనగానే చాలామందకి భక్తికి నిదర్శనం అంటారు. చెట్ల మీద నివాస ఉండే అందమైన ఒక చిన్న ప్రాణి ఇది. చిన్నప్పుడు ‘ఉడతా ఉడతా ఊచ్..ఎక్కడికెళ్ళావోచ్’ అంటూ చాలామందికి పాడే ఉంటారు. ఉడుతకు పురాణ సంబంధం కూడా ఉంది. ఉడుతను చూడగానే అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలు మనసుకి గుర్తొస్తుంటాయి. చిన్నపిల్లల పుస్తకాల్లో ఇప్పటికి ఉడుతల రైమ్స్ ఉన్నాయి. అయితే.. ప్రస్తుత కాలంలో ఉడుత జాతి అంతరించిపోతుందని అటవీశాఖ అధికారులు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొందమంది డబ్బుల సంపాదించాలనే ఆశతో ఉడుతలను చంపేస్తున్నారు పలువురు దుండగులు. అంతేకాదు ఉడుతల వెంట్రుకలు, చర్మాన్ని అమ్ముకుంటున్నారు వేటగాళ్లు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉపాధి కోసం వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నారని అక్కడి అధికాలు చెప్పారు. ఈ దుష్టుల వలన రాష్ట్రంలో ఉడతల తగ్గుతుందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఉడతలను వెంటాడి చంపుతున్న ముగ్గురు వేటగాళ్లను గుర్తించారు. ఉడతలతో పాటు ఇతర జంతువులకు హాని: పశ్చిమ బెంగాల్‌లోని టెహట్టాలోని తారానగర్ ప్రాంతంలో తాజాగా వెలుగులోకి వచ్చిది. వీరంత చాలా కాలంగా స్థానిక ఇటుక బట్టీల కార్మికులు ఉడుతలను వేటాడి చంపుతున్నారని వెల్లడైంది. దీంతో క్రమంగా తగ్గుముఖం పడతున్న ఉడుతలనూ చూసి గ్రామంలోని ప్రజలు అటవీ శాఖ అధికారుల దగ్గర వాపోయారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. వేటగాళ్లను అదుపులోకి తీసుకొని.. పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలంలో చనిపోయిన నాలుగు ఉడుతలు, వేట ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉడతలు చెట్లపై గూడు కడితే.. వాటిని పక్షలు కూడా నివాసం చేసుకుంటాయి. ఇలా చేస్తే ఉడతలతో పాటు ఇతర జంతువులకు హాని ఉంటుందని అక్కడి జంతు ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహాయానికి గుర్తుగా మూడు సారలు: పురాణం విషయానికి వస్తే..శ్రీరామ చంద్రుడు శ్రీ లంకకు వెళ్లడానికి వారది కడుతుంటే ఉడుత నీళ్లలో మునిగి ప్రక్కనే వున్న ఇసుకలో దొర్లి తన శరీరాని కంటుకున్న ఇసుకను రాముడు కడుతున్న వారదిపై సహాయం చేసేది. ఉడుత చేసిన ఈ చిన్న సహాయానికి శ్రీరాముడు మెచ్చి దాని వీపుమీద ప్రేమతో నిమిరాడు. అందుకే దాని వీపు మీద మూడు సారలుంటాయని చరిత్ర చెబుతుంది. అంతేకాదు ఎవరైనా చిన్న సహాయం చేస్తే ఉడుతా భక్తి అని ఉడతను తలుకుంటారు. ఇది కూడా చదవండి: చలికాలంలోనూ తగ్గేదేలే…చమటలు పట్టిస్తోన్న ఎండ..!! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #west-bengal #squirrels #tehatta #taranagar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి