/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/MODI-jpg.webp)
PM MODI : లోకసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రధాని మోదీ ఒకే రోజు పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తు్నారు. శుక్రవారం ఉదయం ఉత్తర ప్రదేశ్ లో పర్యటించారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ చేరుకుని..అక్కడ ప్రకటించారు. దమోహ్ లో ఏర్పాటు చేసిన బీజేపీ భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా అక్కడికి ఓ యువకుడు తీసుకువచ్చిన ఫొటోను చూసి ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు.
సభలో ప్రధాని మోదీ మాట్లాడుతుండగా..దూరం నుంచి ఓ యువకుడు చేతిలో ఫొటో ఫ్రేమ్ పట్టుకుని ఉండటం కనిపించింది. తన మాతృమూర్తి తనను ఆశీర్వదిస్తున్న ఫొటో కనిపించడంతో ప్రధాని ఉద్వేగానికి లోనయ్యారు. పెన్సిల్ తో గీసిన ఆ ఫొటో చూసిన మోదీ కన్నీంటిపర్యంతమయ్యారు. తన తల్లిని గుర్తు చేసుకుని మాటలు రాక ప్రసంగాన్ని కాసేపు ఆపారు. ఆతర్వాత చిత్రాన్ని తీసుకువచ్చిన యువకుడిని మోదీ అభినందించారు. ఆ ఫొటో వెనక అతని పేరు, చిరునామా రాసివ్వాలని మోదీ సూచించారు. తాను లేఖ రాస్తానని ఆయువకుడికి మోదీ చెప్పారు.
#WATCH via ANI Multimedia | 'Emotional' PM Modi stops his speech as he notices portrait of his mother in Madhya Pradesh's Damohhttps://t.co/SHKTxQj0kC
— ANI (@ANI) April 19, 2024
#WATCH | Madhya Pradesh: Addressing a public rally in Damoh, PM Narendra Modi says, "Aaj desh mein vo BJP sarkar hai jo na kisi se dabti hai aur na hi kisi ke saamne jhukti hain'. Our principle is nation first. India should get cheap oil, hence we took the decision in the… pic.twitter.com/bbAtCheMFv
— ANI (@ANI) April 19, 2024