గత హామీలను జగన్ విస్మరించారు... విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ నేతల ఫైర్..!

విజయవాడలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. నానా రకాల జీవోలను తీసుకు వచ్చి కార్మికులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.

New Update

తమకు కేవలం 2 శాతం వేతనాన్ని పెంచడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులకు ఏ విధంగానైతే పెంచారో తమకు కూడా అలానే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. తమ బాధలు చెప్పుకుందామనుకుంటే కనీసం అనుమతి కూడా ఇవ్వడం లేదన్నారు. అనుమతులు లేవంటూ తమను నిర్బంధిస్తున్నారంటూ వాపోయారు.

న్యాయస్థానాలు ఎలా చెప్తే ఆ విధంగా తాము నిరసనలు తెలుపుతామని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు అనేవి ఎన్నికలు నిర్వహించి ఎన్నుకున్న సంఘాలు కాదని తెలిపారు. అవి యాజమాన్యం ఎన్నుకున్న సంఘాలు అంటూ ఫైర్ అయ్యారు. అందుకే ఆ సంఘాలు కేవలం యాజమాన్యం చెప్పినట్టుగా వింటున్నాయంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రజాస్వామ్య బధ్ధంగా ఎన్నుకున్న సంఘాలను యాజమాన్యం గుర్తించడం లేదని వెల్లడించారు. అలాంటి ఉద్యోగ సంఘాల మాటలు తాము పట్టించుకోబోమని తేల్చి చెప్పారు. తమ డిమాండ్ల సాధన కోసం నిరసనలు తెలుపుతామన్నారు. రాబోయే రోజుల్లో స్ట్రగుల్ కమిటీ ముఖ్య నేతలంతా సమావేశమై భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తామని చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు