CMD Prabhakar Rao: ప్రభాకర్ రావు ఇరుక్కున్నారా!.. సీఎండీ రాజీనామాపై కొనసాగుతున్న ఉత్కంఠ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు వ్యవహారంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన రాజీనామా, దానిని ఆమోదించకపోవడం, వీటికి తోడు సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన హాజరు కాకపోవడం వంటి అంశాలన్నీ తదుపరి పరిణామాలపై సస్పెన్స్ ను పెంచుతున్నాయి. By Naren Kumar 09 Dec 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి CMD Prabhakar Rao: ట్రాన్స్‌కో(TRANSCO), జెన్‌కో(GENCO) సీఎండీ ప్రభాకర్‌రావు వ్యవహారంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన రాజీనామా, దానిని ఆమోదించకపోవడం, వీటికి తోడు సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన హాజరు కాకపోవడం వంటి అంశాలన్నీ తదుపరి పరిణామాలపై సస్పెన్స్ ను పెంచుతున్నాయి. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) నిర్వహించిన సమీక్ష సమావేశానికి విద్యుత్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ సమీక్షకు సీఎండీ ప్రభాకర్ రావు రాకపోవడంతో, ఆయనను పిలవాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అయితే, ప్రభాకర్ రావు మాత్రం తనకు అధికారికంగా ఎలాంటి పిలుపూ రాలేదంటున్నారు. ఆయన రాజీనామాపై కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. రాజీనామాను ఆమోదించిందీ.. లేనిదీ.. కూడా స్పష్టత రాలేదు. అయితే, రాజీనామాను ఆమోదించవద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆయన తుది నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పుడు ఆ శాఖ ఉద్యోగుల్లో చర్చలు నడుస్తున్నాయి. ఇది కూడా చదవండి: ఎంఐఎంతో బీజేపీ పొత్తు.. రఘునందన్ రావు క్లారిటీ! ఆ శాఖ అధికారులు శుక్రవారం సీఎం నిర్వహించిన సమీక్షలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాని ప్రకారం రెండు డిస్కంలు, సరఫరా సంస్థ అయిన ట్రాన్స్‌కో, ఉత్పత్తి సంస్థ అయిన జెన్‌కోలకు కలిపి మొత్తం అప్పు రూ.81వేల కోట్లకు పైగా ఉందని సమాచారం. 2014-15 నాటికి ఆ అప్పు రూ.22వేల కోట్లకు పైగా ఉండేది. విద్యుత్ కొనుగోలుకు బిల్లుల కోసం డిస్కంల స్వల్పకాలిక రుణాలు, వాటికి వడ్డీల ద్వారానే అధికంగా భారం పడుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఆరు నెలల్లో ఆదాయ, వ్యయాలను పోల్చి చూస్తే రూ.11వేల కోట్లకు పైగానే లోటు ఉంటుందని అధికారులు చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, విద్యుత్ శాఖలో రూ.81 వేల కోట్ల అప్పులపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేయాలనీ ప్రభుత్వం భావిస్తోంది. సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించకపోవడం, శ్వేతపత్రం విడుదల చేయాలన్న ఆలోచనలో ఉండడం తదితర అంశాలను బట్టి ప్రభాకర్ రావు చుట్టూ ఈ అంశమంతా తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. #telangana #cm-revanth-reddy #cmd-prabhakar-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి