Vizag News: విశాఖ వాసులకు గుడ్ న్యూస్!

మూడు రాజధానులు అని ప్రకటించిన జగన్‌ ప్రభుత్వాన్ని అందరూ విమర్శించిన అవేమి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఏపీ ప్రభుత్వం.ఈ క్రమంలోనే విశాఖ అభివృద్ధి పై పూర్తి దృష్టిని పెట్టింది ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగానే అతి త్వరలోనే విశాఖ రోడ్ల మీద ఎలక్ట్రిక్‌ బస్సులను పరుగులు పెట్టించనున్నారు. మరో మూడు నెలల్లో ఈ బస్సులు రోడ్లు పైకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.

New Update
Vizag News: విశాఖ వాసులకు గుడ్ న్యూస్!

ఇప్పుడు ఏపీ(AP) వాసులు చూపంతా విశాఖ (Vizag)  వైపే ఉంది.ఎందుకంటే ఈ దసరా (Dussera)  నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం అవుతుంది. ఆ ఏర్పాట్లలో జగన్‌(YS jagan) యంత్రాంగం అంతా నిమగ్నమై ఉంది. ఇప్పటికే మూడు రాజధానులు అని ప్రకటించిన జగన్‌ ప్రభుత్వాన్ని అందరూ విమర్శించిన అవేమి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఏపీ ప్రభుత్వం.

publive-image

ఈ క్రమంలోనే విశాఖ అభివృద్ధి పై పూర్తి దృష్టిని పెట్టింది ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగానే అతి త్వరలోనే విశాఖ రోడ్ల మీద ఎలక్ట్రిక్‌ బస్సులను పరుగులు పెట్టించనున్నారు. మరో మూడు నెలల్లో ఈ బస్సులు రోడ్లు పైకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. తొలి విడతలో 100 ఎలక్ట్రిక్‌ బస్సులను నడిపేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ సిద్ధమవుతుందని తెలుస్తోంది.

Also Read: భవ్యశ్రీ మృతిపై ఎస్పీ రిషాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!! అసలు ఏలా చనిపోయిందంటే..?

ఆ తరువాత మరో 100 బస్సులను తీసుకుని వచ్చేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది. అయితే ప్రస్తుతానికి వీటిని సిటీ సర్వీసులుగా నడిపేందుకు సన్నాహాలు జరుపుతున్నారు. అందుకోసం సింహపురి, గాజువాక డిపోలను ఏపీఎస్‌ఆర్టీసీ ఎంపిక చేసుకుంది. ఇప్పటికే ఏపీలోని తిరుపతిలో కొండ పైకి ఎలక్ట్రిక్‌ బస్సులు నడుస్తున్నాయి.

నెల్లూరు- తిరుపతి మధ్య కూడా ఈ బస్సులు నడుస్తున్నాయి. అదే విధంగా ఏపీలోని మిగిలిన పెద్ద నగరాల్లో కూడా వీటిని ప్రవేశపెట్టాలనే ఆలోచన కొన్నాళ్లుగా జరుగుతుంది. అందుకే తొలి దశలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.

దీనికి సంబంధించిన టెండ్లర ప్రక్రియ కూడా పూర్తి చేశారు. విశాఖ నగరానికి 200 ఎలక్ట్రిక్‌ బస్సులు అవసరమవుతాయని ఆర్టీసీ జిల్లా అధికారులు..ఆర్టీసీ యాజమాన్యానికి ప్రతిపాదనలు పంపించారు. దీనికి ఆర్టీసీ యాజమాన్యం పచ్చ జెండా ఊపడంతో అతి త్వరలోనే విశాఖ రోడ్ల మీద ఎలక్ట్రిక్‌ బస్సులు పరుగులు పెట్టనున్నాయి..

Also read: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. రేపటి నుంచే దసరా సెలవులు.. లిస్ట్ ఇదే..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు