AP Game Changer: వెస్ట్ లో ఈ సారి సీన్ రివర్స్?.. RTV స్టడీలో తేలిన ఊహించని లెక్కలివే!

పశ్చిమగోదావరి జిల్లాలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది?.. తదితర ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే.. ఈ ఆర్టికల్ చదివేయండి.

New Update
AP Game Changer: వెస్ట్ లో ఈ సారి సీన్ రివర్స్?.. RTV స్టడీలో తేలిన ఊహించని లెక్కలివే!

వెస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. గతేడాది ఇక్కడ 13 సీట్లలో వైసీపీ, కేవలం 2 సీట్లలో టీడీపీ విజయం సాధించింది. ఈ సారి ఇక్కడ పరిస్థితి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని ఆర్టీవీ స్టడీలో తేలింది. ఈ సారి ఇక్కడ వైసీపీ కేవలం 3 సీట్లకే పరిమితం అవుతుందని.. టీడీపీ 7, జనసేన 5 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ఆర్టీవీ స్టడీ లెక్కలు చెబుతున్నాయి.

పాలకొల్లులో..
ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మరో సారి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రజలకి అందుబాటులో ఉంటారన్న పేరు ఆయనకు ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్‌లో కూడా నిమ్మల గెలిచారు. ఎమ్మెల్యే అయ్యాక పాలకొల్లు రూపురేఖలు మార్చారన్న పేరు ప్లస్ అవుతుంది. ఇక వైసీపీ అభ్యర్థి గోపాలరావు రాజకీయాలకు కొత్త కావడం రామానాయుడుకు అదనపు అడ్వాంటేజ్. మొత్తంగా టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు గెలిచే అవకాశం ఉందని RTV స్టడీలో తేలింది.
publive-image

ఉండి..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అత్యంత హాట్‌సీట్‌గా మారింది ఉండి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజుపై ప్రజల్లో సానుభూతి ఉంది. ఆర్ధిక బలం ఆయనకున్న ప్లస్ పాయింట్. 2019లో ఎంపీగా గెలిచినా నియోజకవర్గంలో అడుగుపెట్టకపోవడం కొంత మైనస్‌గా ఉంది. అయితే వైసీపీ అభ్యర్థి నరసింహరాజు నామమాత్రపు పోటీ ట్రిపుల్ ఆర్‌కు కలిసొస్తుంది. ఇండిపెండెంట్ కలవపూడి శివరామరాజు టఫ్ ఫైట్ ఇచ్చినా ఫైనల్‌గా రఘురామకృష్ణంరాజు విజయం సాధించే అవకాశం ఉందని RTV స్టడీ చెబుతోంది.
publive-image

దెందులూరు..
వెస్ట్‌లో మరో కీలక నియోజకవర్గం దెందులూరు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్యచౌదరి బలమైన క్యాడర్‌ని తయారు చేసుకోవడం ప్లస్ అవుతోంది.
ప్రత్యర్థులతో పోలిస్తే ప్రజలతో బాగా కలిసిపోతారన్న పేరుంది. నిత్యం ఏదో కార్యక్రమంతో ప్రజల్లోనే ఉండటం ప్లస్ పాయింట్. ప్రత్యర్థి చింతమనేని దూకుడు తత్వం కూడా అబ్బయ్యచౌదరికి అడ్వాంటేజ్. ఫైనల్‌గా కొఠారు అబ్బయ్యచౌదరి విజయం సాధిస్తారని మా స్టడీలో తేలింది.
publive-image

ఇతర నియోజకవర్గాల్లో..
కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి ఉప్పిడి వెంకటేశ్వరరావు, నిడదవోలు-జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్, ఆచంట-టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ, నరసాపురం-జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్, భీమవరం-జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, తణుకు-టీడీపీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ గెలిచే అవకాశం ఉంది.
publive-image

తాడేపల్లిగూడెం-జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు-జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు, ఏలూరు-టీడీపీ అభ్యర్థి బడేటి చంటి, గోపాలపురం-వైసీపీ అభ్యర్థి తానేటి వనిత, పోలవరం వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి, చింతలపూడి-టీడీపీ అభ్యర్థి సోంగా రోషన్ గెలిచే అవకాశం ఉన్నట్లు ఆర్టీవీ స్టడీలో తేలింది.
publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు