AP Elections 2024 : ఏపీ శాసనసభ చరిత్ర ఇదే! దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటికి ఆంధ్రా ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీలో ఉంది. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. నవంబర్ 1, 1956న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాంగా అవతరించింది. ఏపీ శాసనసభ చరిత్ర ఏంటి లాంటి విషయాల కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Vijaya Nimma 16 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి AP History : అప్పుడు ఎంతమంది ఉన్నారంటే? భాషా ప్రతిపాదికన ఆవిర్భవించిన తొలి రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh). 2014లో రాష్ట్ర విభజనకు ముందు ఇండియన్ యూనియన్(Indian Union) లో ఐదో అతిపెద్ద రాష్ట్రం ఇది. ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్(Hyderabad) స్టేట్‌లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలిపి ఓ రాష్ట్రంగా ఏర్పాటు చేసింది నాటి నెహ్రూ సర్కార్. ఇలా నవంబర్ 1, 1956న ఏపీ ఏర్పడింది. ఏపీ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో 140 మంది సభ్యులు ఉన్నారు. అటు హైదరాబాద్ స్టేట్‌లో 105 మంది సభ్యులు ఉన్నారు. అంటే 1956 సమయానికి ఏపీ శాసనసభ సభ్యుల సంఖ్య 245 అన్నమాట. Also Read: జగన్ ను రాయితో కొట్టిన సతీష్ ఇతనే..! 1958లో శాసన మండలి ఏర్పాటైంది. దీంతో అప్పటివరకు ఉన్న ఏకసభ్య విధానం ఉభయసభలుగా మారింది. ఆ తర్వాత నియోజకవర్గాల విభజన జరిగింది. దీని కారణంగా ఏపీ శాసనసభ సభ్యుల సంఖ్యలో మార్పులు జరిగాయి. 1956లో 245, 1962లో 300, 1967-1972లో 287, 1978 నుంచి 2014 వరకు 294 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలుగా విడిపోయిన తర్వాత ఏపీ శాసనసభ సభ్యుల సంఖ్య 175కు చేరింది. కౌన్సిల్ ఏర్పాటు.. రద్దు: భారత రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం(APJ Abdul Kalam) జూలై 14, 2004న పన్నెండవ శాసనసభను ఉద్దేశించి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలో దేశపు మొదటి పౌరుడు శాసనసభను ఉద్దేశించి ప్రసంగించడం అది రెండవసారి. గతంలో డా. నీలం సంజీవ రెడ్డి జూన్ 28, 1978న శాసన సభ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలోని ప్రతి రాష్ట్రానికి గవర్నర్, శాసన సభతో కూడిన అసెంబ్లీ ఉంటుంది. ఇక రాష్ట్ర శాసనసభ ఏ సమయంలోనైనా ఎగువ సభను అంటే కౌన్సిల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అదే ఎగువ సభను రద్దు కూడా చేసుకోవచ్చు. దేశంలో ఉభయ సభలు ఉన్న కొన్ని రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. 1957లో ఎగువ సభను ఏర్పాటు చేశారు. 1985లో నాటి ఎన్టీఆర్ ప్రభుత్వం ఈ సభను రద్దు చేసింది. తిరిగి 2007లో నాటి వైఎస్ సర్కార్ సభను ఏర్పాటు చేసింది. మొత్తం మూడు సమావేశాలు: ఇక ప్రస్తుత శాసనసభలో 175 మంది సభ్యులు ఉన్నారు. వీరందరిని ప్రజలే ఓటు హక్కు ద్వారా నేరుగా ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేల పదవీ కాలం ఐదేళ్లు. అసెంబ్లీని త్వరగా రద్దు చేయాలని నిర్ణయించుకుంటే తప్ప ఈ వ్యవధి మారదు. ఇక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 333 ప్రకారం ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ నుంచి గవర్నర్ నామినేట్ చేసిన ఒక సభ్యుడు కూడా శాసనసభలో ఉంటారు. అటు శాసన సభ ప్రధాన విధులు చట్టాన్ని రూపొందించడం, పరిపాలనను పర్యవేక్షించడం, బడ్జెట్‌ను ఆమోదించడం. శాసనసభ సంవత్సరానికి మూడు సమావేశాలను నిర్వహిస్తుంది. ఒకటి బడ్జెట్ కోసం. రెండోది వర్షాకాల, మూడోది శీతాకాల సమావేశాల కోసం. #andhra-pradesh #ap-elections-2024 #indian-union మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి