Election Rules : రోడ్ షోల నిర్వహణపై ఎలక్షన్ కమిషన్ నయా రూల్.. ఆ రోజుల్లోనే.. 

ఎన్నికల ప్రచారం కోసం పార్టీల రోడ్ షోల నిర్వహణపై ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది.   ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు సెలవు రోజులు, ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయాల్లో రోడ్ షోలకు అనుమతి ఇవ్వబోమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ పేర్కొన్నారు. 

New Update
Election Rules : రోడ్ షోల నిర్వహణపై ఎలక్షన్ కమిషన్ నయా రూల్.. ఆ రోజుల్లోనే.. 

Election Rules : ఎన్నికల ప్రచారం కోసం పార్టీలు నిర్వహించే రోడ్ షోలకు అనుమతులపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌(Vikas Raj) కీలక ప్రకటన చేశారు. సెలవు రోజులు, ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండే సమయాల్లో మాత్రమే రోడ్ షో(Road Show) లకు అనుమతి ఇస్తామని ఆయన తెలిపారు. లోక్ సభ ఎన్నిల నిర్వహణ కోసం చేస్తున్న ఏర్పాట్లను మీడియాకు సోమవారం ఆయన వివరించారు. నిజానికి ఇతర సమయాలలో రోడ్ షోల పై నిషేధం లేదు. కానీ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు గానూ అనుమతి(Election Rules) ఇవ్వలేమని తెలిపారు. ఇక ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులు, ట్రామాకేర్ సెంటర్లు ఉన్న ప్రదేశాల్లో కూడా రాడ్ షోలు చేయడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు. 

కొత్త ఓటర్లకు అప్పటివరకూ అవకాశం.. 
ఇప్పటికీ ఓటర్లు(Voters) గా నమోదు కాని వారు ఏప్రిల్ 15 వరకూ ఓటరు నమోదు చేసుకోవచ్చని వికాస్‌రాజ్‌ తెలిపారు. ఫారం-6 లో అప్లై చేసుకున్నవారందరికే ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు. అయితే, చిరునామా మార్పు, కరెక్షన్స్ మాత్రం ఎన్నికల(Election Rules) తరువాత మాత్రమే అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాకా 12 లక్షల కొత్త ఓటర్లు నమోదు అయ్యారనీ, 8,58,491 ఓటర్లను తొలగించామని చెప్పారు. మొత్తం 30 లక్షల బోగస్ ఓట్లను గత రెండున్నరేళ్లలో తొలగించామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా హైదరాబాద్ పాత బస్తీలో బోగస్ ఓట్లున్నట్టు ఫిర్యాదులు వచ్చాయనీ, వాటిపై జిల్లా ఎన్నికల అధికారి విచారణ చేశారని చెప్పారు. అక్కడ నుంచి రిపోర్ట్ అందిన తరువాత దానిని బట్టి చర్యలు తీసుకుంటామని వికాస్‌రాజ్‌వివరించారు.

Also Read: జాగ్రత్త.. ఎమ్మెల్యే అభ్యర్థులకు జగన్ వార్నింగ్!

అంతకంటే ఎక్కువ నగదు ఉంటే.. 
ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో నగదు క్యారీ చేసే విషయంలో నిబంధనలు(Election Rules) పాటించాలని వికాస్‌రాజ్‌ సూచించారు. ఎట్టిపరిస్థితిలోనూ 50 వేల రూపాయలకు మించి నగదు తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు. ఎవరైనా ఎక్కువ నగదుతో దొరికితే చట్టప్రకారం చర్యలుంటాయని(Election Rules) హెచ్చరించారు. అలాగే,  ఈ నెల (మార్చి) ప్రారంభం నుంచి ఇప్పటివరకూ (ఆదివారం) రూ.21.63 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) ముగిసిన దగ్గర నుంచి ఇప్పటివరకూ రూ.243 కోట్లు విలువైన నగదును సాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 

పగడ్బందీగా ఏర్పాట్లు.. 
రాబోయే ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్(Election Commission) అన్నిరకాలుగాను పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఓటర్లు స్వేఛ్చగా ఓటు వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేసవి కాలం కావడంతో పోలింగ్ బూత్ ల వద్ద మంచినీటి ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా ఓటర్లకు భద్రత కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Russia-Ukrain-Putin: ఉక్రెయిన్‌ తో చర్చల పునరుద్దరణకు రెడీ..!

ఉక్రెయిన్‌ తో చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేర్కొన్నారు. ముందస్తు షరతులు లేకుండానే వీటికి సిద్ధమని స్పష్టం చేశారు.అమెరికా ప్రతినిధి స్టీవ్‌విట్కోఫ్‌ తో ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం.

New Update
 putin

putin Photograph: (putin )

ఉక్రెయిన్‌ తో చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేర్కొన్నారు. ముందస్తు షరతులు లేకుండానే వీటికి సిద్ధమని స్పష్టం  చేశారు.రష్యా పర్యటనలో ఉన్న అమెరికా ప్రతినిధి స్టీవ్‌విట్కోఫ్‌ తో ఈ విషయాన్ని వెల్లడించినట్లు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌తో చర్చలకు సంబంధించిన విషయాన్ని పుతిన్‌ చాలాసార్లు స్పష్టం చేశారని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ వెల్లడించారు.

Also Read:పాక్‌కు ఎగుమతులు ఆపేసిన భారత్.. భారీగా తగ్గనున్న వస్తువులు

యుద్ధం ముగించేందుకు చర్చల కోసం ప్రయత్నాలు జరుపుతున్న వేళ ఉక్రెయిన్‌ పై రష్యా భీకర దాడులకు పాల్పడుతుండటం పై ట్రంప్‌ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాల పై రష్యా సైన్యం దాడులు జరపడం చూస్తుంటే పుతిన్‌ కు యుద్ధం ఆపడం ఇష్టం లేదని అనిపిస్తోందన్నారు.

Also Read: Omar Abdullah: పాక్‌ ప్రధానిపై ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

అనేక మంది చనిపోతున్నారని,మాస్కో పై మరిన్ని ఆంక్షల పై ఆలోచించక తప్పదన్నారు.రోమ్‌ లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో భేటీ అయిన తరువాత సొంత సోషల్‌ మీడియా వేదిక పై ట్రంప్‌ ఈ విధంగా స్పందించారు. అంతకుముందు రష్యాకు అనుకూలంగా మాట్లాడిన ట్రంప్‌..క్రిమియా రష్యాతోనే ఉంటుందని అన్నారు.

ఆ ప్రాంతం రష్యాతో ఉన్నవిషయాన్ని జెలెన్‌ స్కీ సహా ప్రతి ఒక్కరూ త్వరలో అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు. మరో వైపు భీకర దాడులను ఆపాలని, ఇప్పటికైనా శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని పుతిన్‌ కు చెప్పిన కొన్ని గంటల్లోనే మాస్కో నుంచి సానుకూల స్పందన రావడం మరో విశేషం.

Also Read:BIG BREAKING: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

Also Read:Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

putin | russia | zelensky | putin vs zelensky | ukraine-zelenskyy | zelensky vs putin | ukrain | trump | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment