Poling Agents: ఎవరినైనా నియమించుకోవచ్చు.. పోలింగ్ ఏజెంట్ల విషయంలో ఈసీ క్లారిటీ..

పోలింగ్ ఏజెంట్ల నియామకం విషయంలో ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ఏజెంట్లను నియమించుకోవడానికి ఎలాంటి ముందస్తు అనుమతులు అవసరం లేదని చెప్పింది. ఎన్నికల సంఘం చెప్పిన పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడవచ్చు. 

New Update
Poling Agents: ఎవరినైనా నియమించుకోవచ్చు.. పోలింగ్ ఏజెంట్ల విషయంలో ఈసీ క్లారిటీ..

Poling Agents: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది. తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నికల ఏజెంట్‌గా నియమించుకోవచ్చని, చట్టం ప్రకారం అభ్యర్థులకు ఆ హక్కు -స్వేచ్ఛ ఉందని ఈసీ చెప్పింది. ఈ విషయాలను వివరిస్తూ ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసింది. దాని ప్రకారం.. ఏజెంట్ల విషయంలో నిబంధనలు ఇలా ఉన్నాయి.  రిటర్నింగ్ అధికారి ఏజెంట్ల పేర్ల జాబితాను సమర్పించాల్సిన అవసరం లేదు. అభ్యర్థి లేదా అతని లేదా ఆమె ప్రధాన ఏజెంట్ సంతకం చేసిన అపాయింట్‌మెంట్ లేఖను సమర్పిస్తే సరిపోతుంది.  ఓటింగ్ రోజున నామినేషన్ పత్రాన్ని నేరుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ కు అందజేస్తే, ఏజెంట్ నుంచి డిక్లరేషన్ తీసుకుని ఓటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు.  ప్రిసైడింగ్ ఆఫీసర్ దానికి సంబంధించి నియామక పత్రాన్ని తన వద్దే ఉంచుకుంటారు. 

Poling Agents: ఒక నియోజకవర్గంలో ఓటరుగా ఉన్న ఏ వ్యక్తి అయినా ఆ నియోజకవర్గంలోని ఏదైనా పోలింగ్ స్టేషన్‌లో ఏజెంట్‌గా నియమించబడవచ్చు. వారికి కావాల్సింది ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు పత్రం మాత్రమే. ఎన్నికల ఏజెంట్ల నియామకానికి ఇతర విద్యార్హతలు అవసరం లేదు. పోలీసు కేసులున్నాయని సాకు చెప్పి ఏజెంట్ నియామకాన్ని నిరోధించలేరు. రిటర్నింగ్ అధికారి (RO) ఎవరైనా ఏజెంట్ల జాబితాను అందించమని బలవంతం చేస్తే, దానిని తిరస్కరించవచ్చు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.

Also Read: ఆయన నా గురువు కాదు.. సహచరుడు.. చంద్రబాబుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 

Poling Agents: "పోలింగ్ ఏజెంట్ల జాబితా లేదా ఆ పోలింగ్ ఏజెంట్ల పోలీసు వెరిఫికేషన్ వివరాలను అడిగే అధికారం రిటర్నింగ్ అధికారికి లేదు. చట్టంలో అలాంటి నిబంధన లేదు. కానీ కొండెపితో సహా చాలా నియోజకవర్గాల్లో, కొంతమంది రిటర్నింగ్ అధికారులు అభ్యర్థులను పంపాలని ఆదేశిస్తున్నారు. స్థానికంగా ఉన్న నిబంధనలను ఎలా ఉల్లంఘిస్తారంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఈ నెల 8న రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ రాశారు ఆ లేఖను అనుసరించి ఎన్నికల సంఘం ఎన్నికల ఏజెంట్ల నియామకంపై పూర్తి స్పష్టతతో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు