CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఈసీ షాక్! TS: లోక్ సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. శ్రీరామ నవమి - భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారికి సీఎం రేవంత్ రెడ్డి పట్టువస్త్రాల సమర్పణకు, కళ్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి ఎలక్షన్ కమిషన్ నిరాకరించింది. By V.J Reddy 16 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth Reddy: లోక్ సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున శ్రీరామ నవమి - భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారికి సీఎం రేవంత్ రెడ్డి పట్టువస్త్రాల సమర్పణకు, కళ్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి ఎలక్షన్ కమిషన్ నిరాకరించింది. ఒకవేళ తాము విధించిన ఆంక్షలు ఎవరైనా ఉల్లఘించి.. లైవ్ ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు అయోధ్య రామమందిరం లో ప్రత్యేక్ష ప్రసారం ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ ఎలాంటి ఆంక్షలు పెట్టకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఈసీ పై విమర్శలు చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘం బీజేపీ పార్టీకి కాస్తుందని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. మోడీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని ఫైర్ అవుతున్నారు. శ్రీరామ నవమి - భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారికి సీఎం @revanth_anumula పట్టువస్త్రాల సమర్పణకు, కళ్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి ఎలక్షన్ కమిషన్ నిరాకరణ. అయోధ్యలో జరిగే కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారానికి మాత్రం అభ్యంతరంలేదని #BJP ట్వీట్‌ను బట్టి తెలుస్తోంది. pic.twitter.com/Y5G1moz0zJ — Ayodhya Reddy Boreddy (@ayodhya_boreddy) April 16, 2024 #cm-revanth-reddy #election-commission మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి