/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Enforcement-Directorate-jpg.webp)
Enforcement Directorate: ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు చేపట్టింది. HYDలో ఇప్పటి వరకు రూ.12.87 కోట్లు అధికారులు సీజ్ చేశారు. అలాగే.. రూ.1.86 కోట్ల విలువైన వస్తువులు, 19,798 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు చేపట్టింది. HYDలో ఇప్పటి వరకు రూ.12.87 కోట్లు అధికారులు సీజ్ చేశారు. అలాగే.. రూ.1.86 కోట్ల విలువైన వస్తువులు, 19,798 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Enforcement Directorate: ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు చేపట్టింది. HYDలో ఇప్పటి వరకు రూ.12.87 కోట్లు అధికారులు సీజ్ చేశారు. అలాగే.. రూ.1.86 కోట్ల విలువైన వస్తువులు, 19,798 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
మస్క్...ట్రంప్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవారో పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయనో మూర్ఖుడంటూ మండిపడ్డారు.నవారో మస్క్ కార్ల కంపెనీ పై తీవ్ర విమర్శలు చేశారు.దీని పై ఎలాన్ మస్క్ తీవ్రంగా మండిపడ్డారు.
musk
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల పై ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోన్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ టారిఫ్ ల పై ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేసిన మస్క్...ట్రంప్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవారో పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయనో మూర్ఖుడంటూ మండిపడ్డారు.
వైట్ హౌస్ సీనియర్ అడ్వైజర్ పీటర్ నవారో మీడియాతో మాట్లాడుతూ..మస్క్ కార్ల కంపెనీ పై తీవ్ర విమర్శలు చేశారు.అది కార్ల తయారీ కంపెనీ కాదని, కేవలం కూర్పు చేసేదంటూ ఆరోపించారు. బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్,టైర్లు వంటి విడిభాగాలను జపాన్,చైనా నుంచి తీసుకువచ్చి..కేవలం అసెంబ్లింగ్ చేస్తారని అన్నారు.
చౌకగా లభించే విదేశీ విడిభాగాలే ఆయనకు కావాలని నవారో పేర్కొన్నారు. దీని పై ఎలాన్ మస్క్ తీవ్రంగా మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..నవారో మూర్ఖుడు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. అమెరికాలో తయారయ్యే కార్లలో టెస్లాదే అగ్రభాగమని చెప్పారు. అంతకుముందు ట్రంప్ టారిఫ్ విధానం పై మస్క్ అసంతృప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి.
చైనా టారిఫ్ లపై వెనక్కి తగ్గాలని అధ్యక్షుడికి సూచించారని, అయితే ఆ చర్చలు విఫలమైనట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ వాణిజ్య సలహాదారుడి పై డోజ్ సారథి ఘాటు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
white-house | doze | tesla | america | trump | eleon-musk | musk | peter navaro | trade-advisor | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates