Job Fraud Case: సోషల్ మీడియా ద్వారా నిరుద్యోగులపై వల, రూ. 720 కోట్ల వసూలు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జాబ్ ఫ్రాడ్ కేసులో ఎంట్రీ ఇచ్చిన ఈడీ స్పీడ్ పెంచుతోంది. దీంతో ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుజరాత్ కు చెందిన నిందితుడు ప్రజాపతిపై ఈడీ అధికారులు ఫ్రాడ్ కేసును నమోదు  చేశారు. కాగా,కేవలం సోషల్ మీడియా ద్వారానే నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో లింకులు పంపి నిందితుడు 720 కోట్లు వసూలు చేసినట్లు సంచలన విషయాలు ఈడీ ప్రాథమిక విచారణలో బయటపడ్డాయి...

New Update
Job Fraud Case: సోషల్ మీడియా ద్వారా నిరుద్యోగులపై వల, రూ. 720 కోట్ల వసూలు

Job Fraud Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జాబ్ ఫ్రాడ్ కేసులో ఎంట్రీ ఇచ్చిన ఈడీ (Enforcement Directorate) స్పీడ్ పెంచుతోంది. దీంతో ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుజరాత్ కు చెందిన నిందితుడు ప్రజాపతిపై ఈడీ అధికారులు ఫ్రాడ్ కేసును నమోదు  చేశారు. కాగా,కేవలం సోషల్ మీడియా ద్వారానే నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో లింకులు పంపి నిందితుడు 720 కోట్లు వసూలు చేసినట్లు సంచలన విషయాలు ఈడీ ప్రాథమిక విచారణలో బయటపడ్డాయి.

దీంతో అతని పై ఈడీ ఫ్రాడ్ కేసును బుక్ చేసింది. మరోవైపు బాధితుల ఫిర్యాదుతో నిందితుడు ప్రజాపతిపై హైదరాబాద్ లోని సీసీఎస్ లో కేసు నమోదైంది. ఇక ప్రజాపతి గుజరాత్ నుంచి దుబాయ్ కు మకాం మార్చాడు. అక్కడి నుంచే ఇండియాలోని నిరుద్యోగులకు ఎమ్ఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలంటూ వల చేసి ఒక్కొక్కరి దగ్గర్నుంచి భారీ మొత్తంలో రాబట్టాడు. దీంతో దేశ వ్యాప్తంగా వేల మంది నిరుద్యోగులు మోసగాడు ప్రజాపతి వలలో పడ్డారు. ఇక తెలంగాణలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిల్లో నిందితుడి పై వందల సంఖ్యలో ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో వాటన్నింటిని సీసీఎస్ కు బదిలీ చేయడం జరిగింది. ఇక వేల సంఖ్యలో బాధితులు.. కోట్లలో మోసం జరగడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ ఈ కేసును టేకప్ చేసింది.

ఉగ్రవాద సంస్థలతో ప్రజాపతికి లింకులు..

మోసగాడు ప్రజాపతికి ఉగ్రవాద సంస్థలతో లింకులున్నట్టు పోలీసుల విచారణలో బట్టబయలైంది. హిజ్బుల్ ముజాహిద్ సంస్థలకు నిధులు మళ్లించినట్టు అధికారులు గుర్తించారు. అంతే కాదు హవాలా రూపంలో పలు ఉగ్రవాద సంస్థలకు నిధులు పంపుతున్నట్టుగా అధికారులు తేల్చారు. అయితే దుబాయ్ లో మకాం వేసి ఇండియాలోని నిరుద్యోగులకు వందల కోట్ల టోకరా పెట్టిన ప్రజాపతిని అరెస్ట్ చేయడానికి ఈడీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Also Read: ముంబైలో షాకింగ్ ఘటన.. ప్రాణం తీసిన స్వల్ప వాగ్వాదం

Advertisment
Advertisment
తాజా కథనాలు