Ranchi: మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో ఈడీ దాడులు.. 30 కోట్లు స్వాధీనం! జార్ఖండ్ మంత్రి ఆలం గిర్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంటి పనిమనిషి నివాసాలపై ED దాడులు చేసింది. ఈ దాడుల్లో ED భారీ నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. పట్టుబడిన నగదు 30 కోట్ల పైనే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. By Bhavana 06 May 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి ED Raids : ఓ వైపు లోక్ సభ ఎన్నిక(Lok Sabha Elections) ల హడావిడి దేశ వ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మూడో విడత ఎన్నిలకు మే 7 న జరగనున్నాయి. ఇదిలా ఉంటే జార్ఖండ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. నిజానికి మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద, ED అర డజనుకు పైగా ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. పలువురు రాజకీయ నాయకుల ఇళ్లపైనా ఈడీ దాడులు చేసింది. జార్ఖండ్ మంత్రి ఆలం గిర్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంటి పనిమనిషి నివాసాలపై ED దాడులు చేసింది. ఈ సోదాల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు లెక్కింపు కొనసాగుతోంది. నోట్లను లెక్కించేందుకు యంత్రం ED రైడ్‌లో దొరికిన నోట్లు జార్ఖండ్(Jharkhand) మంత్రి అలంగీర్‌తో ముడిపడి ఉన్నాయి. నోట్లను లెక్కించేందుకు యంత్రాలను ఆదేశించారు. జార్ఖండ్ రూరల్ డెవలప్‌మెంట్ మంత్రి అలంగీర్ ఆలంతో సంబంధం ఉన్న వ్యక్తి ఇంటి నుండి ED భారీ నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. పట్టుబడిన నగదు 30 కోట్ల పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నోట్లను లెక్కించేందుకు బ్యాంకు ఉద్యోగులు, యంత్రాలను కూడా పిలిపించారు. రెండేళ్ల క్రితం ఇదే రోజున జార్ఖండ్‌లోని ఐఏఎస్ పూజా సింఘాల్ ఇంటిపై దాడి జరిగింది. ఆ దాడిలో రూ.17 కోట్లు దొరికాయి. #WATCH | The Enforcement Directorate is conducting raids at multiple locations in Ranchi. Huge amount of cash recovered from household help of Sanjiv Lal - PS to Jharkhand Rural Development minister Alamgir Alam, in Virendra Ram case. ED arrested Virendra K. Ram, the chief… pic.twitter.com/VTpUKBOPE7 — ANI (@ANI) May 6, 2024 వీరేంద్ర రామ్ కేసులో దాడులు గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కె రామ్‌కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కె రామ్ ఫిబ్రవరి 2023లో మనీలాండరింగ్ కేసు(Money Laundering Case) లో అరెస్టైన సంగతి తెలిసిందే. వాస్తవానికి, మనీలాండరింగ్ , కొన్ని పథకాల అమలులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం వీరేంద్ర కె రామ్ వద్దకు చేరుకుని అతడిని అరెస్టు చేసింది. ED రైడ్‌లో భారీ మొత్తంలో నగదు దొరికిన తరువాత, చాలా మందిని అరెస్టు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. Also read: కాంగ్రెస్ నేత చెంప పగలకొట్టిన డీకే! #ed #jharkhand #attacks #ranchi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి