AP Elections: పోలింగ్ వేళ ఈసీ సంచలన నిర్ణయం.. ఆ ఐదుగురు సీఐలపై వేటు!

మరికొన్ని గంటల్లో పోలింగ్‌ మొదలవనుండగా ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి ఐదుగురు సీఐలపై వేటు వేసింది. జగన్మోహన్‌రెడ్డి, అంజూయాదవ్‌, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, వినోద్‌కుమార్‌లను తిరుపతి నుంచి అనంతపురం జిల్లాకు బదిలీ చేసింది.

New Update
AP Elections: పోలింగ్ వేళ ఈసీ సంచలన నిర్ణయం.. ఆ ఐదుగురు సీఐలపై వేటు!

EC Transfers 5 CI's From Tirupati: మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ మొదలవనుండగా ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా తిరుపతి కేంద్రంగా పలు వివాదాలు ఇప్పటికే హాట్ టాపిక్ గా మారుతుండగా తాజాగా ఈసీ (Election Commission) సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని ఐదుగురు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి..
ఈ మేరకు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి పలువురు నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై విచారణ చెపట్టిన ఈసీ.. ఐదుగురు సీఐలపై చర్యలు తీసుకుంది. తిరుపతికి చెందిన ఐదుగురు సీఐలు.. జగన్మోహన్‌రెడ్డి, అంజూయాదవ్‌, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, వినోద్‌కుమార్‌లను అనంతపురం జిల్లాకు బదిలీ చేసింది. ఈ ఐదుగురు అనంతపురంలో ఎన్నికల విధులు నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

Also Read: టీడీపీ నేతకు షాక్.. ఓటుకు డబ్బులు ఇవ్వాలంటూ ఆందోళన

Advertisment
Advertisment
తాజా కథనాలు