BREAKING: ఏపీ ఎన్నికలపై ఈసీ కీలక ఆదేశాలు

ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు ఈసీ బృందం అధికారులు ఏపీలో పర్యటించనున్నారు.

New Update
AP Elections 2024: ఏపీలో ఎన్నికల సందడి.. రేపు రాష్ట్రానికి సీఈసీ.. మూడు రోజుల పాటు పర్యటన!

AP Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు ఏపీలో పర్యటించనుంది. రెండు రోజుల పాటు సీఎస్‌, డీజీపీలతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ (Election Commission) బృందం సమావేశం కానుంది. సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్‌ వ్యాస్‌ సహా డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ హిర్దేశ్‌ కుమార్‌లతో కూడిన ఏడుగురు సభ్యులు బృందం రాష్ట్రంలో పర్యటన చేపట్టనుంది. రెండు రోజుల పాటు 2024 ఓటర్ల జాబితాల (Voters List)  రూపకల్పనతో పాటు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్ష చేపట్టనున్నారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధత పరిస్థితిపై కలెక్టర్లు నివేదికలు సమర్పించనున్నారు. ఈ నెల 23వ తేదీన సీఎస్, డీజీపీలతో పాటు కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతోనూ ఈసీ బృందం భేటీ కానుంది.

ALSO READ: వాహనదారులకు గుడ్ న్యూస్… చలాన్లపై మరోసారి రాయితీ!

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు..

ఏపీలో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ఆదేశాలు ఇచ్చింది. దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులను.. ఎన్నికల నిర్వహణలో ఉండకూడదని ఈసీ పేర్కొంది. వారిని వెంటనే బదిలీ చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులను వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. నిబంధనలు పాటించని అధికారులను దూరం పెట్టాలని తెలిపింది. అలాంటి అధికారుల డేటాను నమోదు చేయాలని ఈసీ పేర్కొంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు, చీఫ్‌ సెక్రటరీలకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది.

ALSO READ: నేడు భారత్ బంద్… మావోయిస్టుల పిలుపు

Advertisment
Advertisment
తాజా కథనాలు