Belly Fat: ఉదయాన్నే ఈ ఆహారాలు తీసుకుంటే బెల్లీ ఫ్యాట్‌ పరార్

శరీర భాగాలు అందంగా ఉండాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. బ్యాడీలో ఏ భాగం పెరిగినా.. తగ్గినా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ పొట్ట, నడుము దగ్గర కొవ్వు చేరితే శరీరాకృతే మారిపోతుంది. బెల్లీ ఫ్యాట్‌ వచ్చిదంటే వ్యాయామ. వాకింగ్‌, యోగ, మంచి డైట్‌ వంటివి చేస్తే త్వరగా బరువు తగ్గుతారు.

New Update
Belly Fat: ఉదయాన్నే ఈ ఆహారాలు తీసుకుంటే బెల్లీ ఫ్యాట్‌ పరార్

Belly Fat: మారుతున్న జీవన శైలి.. ఆహారపు అలవాట్ల వల్ల అనేకమంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం రకరకాల వ్యాయామాలు, రకరకాల ఆహారం తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుత కాలంలో బరువు త‌గ్గడం, పొట్టలో కొవ్వు క‌రిగించ‌డం మ‌రింత క‌ష్టమైన టాస్క్‌. ఈ విషయంలో ఈరోజుల్లో అందరు ఎదుర్కొంటున్న సమస్య. అంతేకాదు అధిక బరువు పెరిగినంత సులువుగా బరువు తగ్గలేరు. కానీ.. బరువు తగ్గాలని అనుకుంటే చాలు త్వరగా బరువు తగ్గుతారు. చాలామంది బరువు తగ్గాలని ఫుడ్స్‌ తినడం మానేస్తే ఇంకా ఎక్కువ బరువు పెరుగుతారని కొన్ని అధ్యాయనాలు అంటున్నారు.

ఇది కూడా చదవండి: చలికాలంలో చర్మ సమస్యలకు ఈ జ్యూస్‌ చాలా బెస్ట్

చాలామంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే.. ఈ డైట్ అంటే సరైన సమయానికి.. సరైన మోతాదులో తీసుకోవడం. కానీ దీనిని ఎవరు సక్రమంగా ఫాలో చేయలేరు. సాధారణంగా అందరూ బరువు తగ్గాలని అల్పాహారాన్ని మానేస్తారు. కానీ ఇది చాలా తప్పని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరానికి అల్పాహారం చాలా అవసరం. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే కచ్చితంగా అల్పాహారం తీసుకోవాలంటున్నారు. అయితే.. బరువు తగ్గాలనుకునేవారు ఉదయం ఉదయం టిఫిన్‌లో తక్కువ క్యాలరీలు ఉన్న అల్పాహారం తింటే బరువు తగ్గుతారు. ఇలాంటి తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

బరువు తగ్గాలంటే ఈ ఆహారాలు బెస్ట్

  • బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్‌ మంచి ఫుడ్స్. ప్రస్తుతం ఈ ఓట్స్‌ని చాలామంది తింటున్నారు. వీటిల్లో కేలరీలు తక్కువ, పీచుపదార్థాలు అధికంగా ఉన్నాయి. దీనిని రోజూ తింటే బరువు సులుగా తగ్గుతారు. కప్పు ఓట్స్‌లో గోరువెచ్చని పాలు, కొంత తేనే , నల్ల ద్రాక్ష, స్ట్రాబెర్రీలు, చెర్రీస్, యాపిల్స్‌ ముక్కలు వంటి పండ్లను కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది.
  • బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే సాంబారుతో రెండు ఇడ్లీలు తింటే మంచిది. దక్షిణ భారతలో ఇడ్లీ సాంబార్ ప్రత్యేకత అల్పాహారం. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో 230 కేలరీలు ఉంటాయి.
  • బరువును తగ్గుతారు ఒక గిన్నెలో రెండు కోడి గుడ్లు పగలగొట్టి, అందులో కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోలు వేసి ఆమ్లెట్ వేసుకోని తినండి. ఇవే కాదు సూప్‌లు, కాల్చిన బ్రౌన్ బ్రెడ్ తిన్నా బరువు సువలభంగా తగ్గుతారని నిపుణులు అంటున్నారు.
  • మిక్సీలో రెండు యాపిల్స్, పాలు పోసి, కొంచెం తేనె, కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసి మిక్సీ చేసుకోని తాగాలి. వీటితో పాటు 10-12 బాదం పప్పులను తింటే మంచి ఫలితం ఉంటుంది.
  • కోడి గుడ్డులో 78 కేలరీలు ఉంటాయి. వీటిని ఉదయాన్నే తింటే ఎక్కువసేపు ఆకలిగా ఉండదు. అలాగే బరువు తగ్గేందుకు గ్రీన్ టీ బెస్ట్‌. దీనిలోఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని మెటబాలిజంను పెంచి వేగంగా బరుగు తగ్గుతారు. అందుకే.. ఉదయం రెండూ సార్లు గ్రీన్‌ టీ తాగితే మంచిది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG Breaking: కాల్పులు ప్రారంభించిన పాకిస్తాన్..

బోర్డర్ దగ్గర పాకిస్తాన్ అప్పుడే కాల్పులను ప్రారంభించేసింది. నిన్న రాత్రి కూడా పలు చోట్ల కాల్పులు జరిపిన  దాయాది దేశం ఈరోజు ఉదయం నుంచి మరింత వేగం పెంచింది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. 

author-image
By Manogna alamuru
New Update
india

Pakistan Started Firing

పాకిస్తాన్ కయ్యానికి కాలు తెగ దువ్వుతోంది. ఉగ్రవాదులను ప్రేరేపించి భారత్ లో టూరిస్టుల ప్రాణాలు పోయేలా చేసిందే కాకుండా ఇప్పుడు భారత్ తో యుద్దం చేయడానికి ఉవ్విళ్లూరుతోంది. ఇండియా సంయమనంతో ఉండాలని చూస్తోంది కానీ ఆ దేశం మాత్రం అలా అనుకోవడం లేదు. నిన్న రాత్రి నుంచి నియంత్రణ రేఖ దగ్గర కాల్పుల తో చెలరేగిపోతోంది. అయితే దీనికి సిద్ధంగానే ఉన్న భారత సైన్యం వాటికి ధీటుగా సమాధానమిస్తోంది. భారత్, పాక్ సీజ్ ఫైర్ ఎత్తేసారని వార్తలు వచ్చాయి. అయితే ఇరు దేశాలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు పాకిస్తాన్ చర్యల వలన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉంది.  

కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు..

పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత దేశం మొత్తం కోపంతో రగిలిపోతోంది. ఈ దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్తాన్‌పై అనేక ఆంక్షలు విధించింది. ఇందులో సింధు జల ఒప్పందం, పాకిస్తానీయుల వీసాల రద్దు, భారతదేశం నుంచి పాకిస్తానీయులు వెళ్ళిపోవాలని వంటి ఆంక్షలను విధించింది.ఇదే సమయంలో ఉగ్రదాడికి పాల్పడిన వారు, దానికి సహకరించిన వాళ్ళు కూడా 'నాశనం' చేయబడతారని ప్రధాని మోదీ గురువారం స్పష్టం చేశారు.  ఇంత జరిగినా పాక్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. భారత్ లానే ఆ దేశం కూడా ఒప్పందాలను రద్దు చేసుకుంది. దౌత్య సంబంధాలను తెగ్గొట్టుకుంది. అదికాక ఇప్పుడు బార్డర్ లో కాల్పులకు తెర తీసింది. నిన్న రాత్రి నుంచి పలు చోట్ల కాల్పులు జరుపుతూనే ఉంది పాక్ సైన్యం. అయితే ఇప్పటికే సిద్ధంగా భారత సిపాయిలు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు రఫెల్ యుద్ధ విమానాలు కూడా బయలుదేశాయి. అలాగే సముద్రంలో ఐఎన్ఎస్ నౌక యుద్ధానికి రెడీగా ఉంది. 

కాశ్మీర్‌కు ఆర్మీ చీఫ్‌

తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్విదేది నేడు జమ్మూకశ్మీర్‌కు వెళ్లనున్నారు. శ్రీనగర్‌, ఉదమ్‌పూర్‌లో పర్యటించనున్నారు. కశ్మీర్‌ లోయలోని ఆర్మీ కమాండర్లు, మిగతా భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ కానున్నారు.

today-latest-news-in-telugu | india | pakistan | border | firing

Advertisment
Advertisment
Advertisment