Health Tips: సబ్జా విత్తనాలు వాటి ప్రయోజనాలు! వేసవి కాలంలో డీహ్రైడేషన్‌కు గురికాకుండా పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. చాలా మంది సాఫ్ట్ డ్రింక్స్ తాగేందుకు మొగ్గు చూపుతారు. కానీ వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సబ్జా గింజలతో చేసే పానీయాలు వేసవిలో బెస్ట్ ఆప్షన్ అని వైద్యులు సూచిస్తున్నారు. అవేంటో మీరూ తెలుసుకోండి. By Durga Rao 28 Jun 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Sabja Seeds Benefits: వేసవిలో ఒంటికి చలవ చేసే పానీయాల్లో సబ్జా గింజలు చాలా మేలు చేస్తాయి. ఇంట్లో, ఆఫీస్‌లో, ప్రయాణాల్లో ఉన్నప్పుడు.. ఎప్పుడైనా సరే.. దాహం తీర్చడంలో సబ్జా గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే సబ్జా గింజలను సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. ఎందుకంటే ఇవి ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తాయి. ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయి. బరువు తగ్గడం ప్రారంభించి శరీరంలో పోషకాహార లోపాలన్నింటినీ కవర్ చేస్తుంది. సబ్జా గింజలను ఎందుకు నానబెట్టి తినాలనే ప్రశ్నకు శిల్పా అగర్వాల్ కారణాలను ఒక వీడియోలో వివరించారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. సబ్జా గింజలు చాలా చిన్నవిగా, నల్లటి నీటి బిందువుల్లా ఉంటాయి. నీరు లేదా ఇతర ఫ్లుయిడ్స్‌తో కలిసిన వెంటనే అవి ఉబ్బుతాయి. అందుకే ఈ గింజలను నానబెట్టకుండా తింటే, అవి ఆహార నాళంలో ఉబ్బిపోయి ఊపిరితిత్తులలో చిక్కుకోవచ్చు. దీని కారణంగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకే కప్పు నీటిలో ఒకటి లేదా రెండు టీస్ఫూన్ల సబ్జా గింజలు 15 నిమిషాల పాటు నానబెట్టి తీసుకోవచ్చు. జెట్-బ్లాక్ కలర్‌లో ఉండే సబ్జా గింజలు తులసి ఆకులకు సమానమైన రుచిని కలిగి ఉంటాయి. ఈ సీడ్స్‌లో ఫైబర్, ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. వీటిని డ్రింక్స్, పుడ్డింగ్స్, సలాడ్లలో యాడ్ చేసుకోవచ్చు. తినే ముందు నానబెట్టడం ద్వారా అవి నీటిని గ్రహించి జెల్‌గా మారతాయి. సులభంగా డైజెస్ట్ అవుతాయి. #health-tips #sabja-seeds మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి