Palmyra Palm: తాటిముంజల లాభాలు తెలుసా?.. వేసవిలో ఎంతో ఉపయోగకరం తాటిముంజలను చేదు తొక్కతో తింటే క్యాన్సర్‌తో పోరాడే శక్తి వస్తుందని నిపుణులు అంటున్నారు. వేసవిలో ఎక్కువగా తినే ఈ ముంజల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తాటిముంజలను తినటం వలన రోగనిరోధక శక్తి, డీహైడ్రేషన్, జీర్ణ సమస్య, వృద్ధాప్య ఛాయలు, బరువు తగ్గటం వంటివి జరుగుతాయి. By Vijaya Nimma 16 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Palmyra Palm: తాటిముంజలను ఇష్టపడని వారు ఉండరు. దాహార్తిని తీర్చడంతో పాటు కడుపు నింపుతుంది. వేసవిలో ఎక్కువగా తినే ఈ ముంజల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకప్పుడు తాటిముంజలను నేరుగా తినేవారు. అయితే ఇప్పుడు మిల్క్ షేక్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. కొందరు తాటిముంజలపై తెల్లటి చర్మాన్ని తొలగించి తింటారు. అయితే ఈ చేదు తొక్కతో తింటే క్యాన్సర్‌తో పోరాడే శక్తి వస్తుందని నిపుణులు అంటున్నారు. తాటిముంజల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. రోగనిరోధక శక్తి: తాటిముంజలు మన రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీలైంత వరకు తొక్కను తీయకుండా తింటే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. డీహైడ్రేషన్: వేడి వాతావరణంలో బయటికి వెళితే త్వరగా చెమటలు పట్టి దాహం వేసే అవకాశం ఉంటుంది. అయితే తాటిముంజలు తింటే శరీరం కోల్పోయిన నీటిని తిరిగి పొందడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా శరీరాన్ని బాగా చల్లబరచడంలో కూడా సహాయపడుతుంది. ఇది శరీరాన్ని బాగా హైడ్రేట్‌గా ఉంచుతుంది. జీర్ణ సమస్యలకు పరిష్కారం: చాలా మందికి ఉండే సమస్య అజీర్ణం. మనం తినే ఆహారం పొట్టలోకి సరిగ్గా చేరకపోతే అజీర్తికి దారి తీస్తుంది. జీర్ణక్రియ సరిగ్గా జరగకపోతే అది మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. మనకు కావాల్సిన పోషకాలు శరీరంలోకి చేరవు. అలాగే ఉబ్బరం, అపానవాయువుకు దారితీస్తుంది. అయితే తాటిముంజలు తింటే జీర్ణక్రియ బాగుంటుంది. వృద్ధాప్య ఛాయలు ఉండవు: చాలా మంది వ్యక్తులు చిన్న వయస్సులోనే ఎక్కువ వయసు ఉన్నట్టు కనిపిస్తుంటారు. తాటిముంజలు తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు ఉండవు. దీనిలోని ఫైటోకెమికల్స్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి. డిటాక్స్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల చర్మంపై ముడతలు, గీతలను త్వరగా తొలగించడానికి ఇది సహాయపడుతుంది. బరువు తగ్గిస్తుంది: బరువు తగ్గాలనుకునే వారికి తాటిముంజలు ఉత్తమ ఎంపిక. ఇందులో వాటర్ కంటెంట్ అలాగే గుజ్జు ఉండటం వల్ల పొట్ట త్వరగా నిండుతుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది కూడా చదవండి: మీ కిచెన్ జిడ్డుగా ఉందా?..ఇలా సులభంగా క్లీన్ చేయండి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #palmyra-palm మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి